రివీలైన Samsung Galaxy A55 కొత్త లాంచ్ టైమ్‌లైన్, లీకైన రెండర్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55
  • ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 3 కలర్స్ లో లభించనున్న ఫోన్

Samsung నుంచి త్వరలో రాబోవు ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A55 గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ ఫోన్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని ముందుగా భావించారు. కానీ, రెండో త్రైమాసికంలో వస్తోందని తాజాగా సమాచారం వెలువడింది. అంటే అనుకున్న సమయం కంటే ఆలస్యంగా Samsung Galaxy A55 మార్కెట్ లోకి రానుంది. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క రెండర్స్ కూడా లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • SamMobiles రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A55 డివైజ్ 2024 రెండో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • అంటే, Samsung Galaxy A55 డివైజ్ ఏప్రిల్ మరియు జూన్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది.
  • Samsung Galaxy A55 5G తో పాటు Samsung Galaxy A35 5G కూడా లాంచ్ కానుందని సమాచారం.

Samsung Galaxy A55 5G రెండర్స్ (లీక్)

  • Android Headlines అనే వెబ్‌సైట్ Samsung Galaxy A55 5G యొక్క ఫస్ట్ గిమ్స్ ని తన రిపోర్ట్ ద్వారా అందించింది.
  • Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లిలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Samsung Galaxy A55 5G లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెటల్ ఫ్రేమ్ వాడినట్లు తెలుస్తోంది.
  • Samsung Galaxy A55 5G లో వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి.
  • Samsung Galaxy A55 5G బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడినట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A55 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.