హైలైట్స్:
- జులై 19 న చైనాలో లాంచ్ అవుతోన్న ఐకూ 10 సిరీస్
- ఈ లైనప్ లో ఐకూ 10 మరియు ఐకూ 10 ప్రో మోడల్స్ ఉంటాయి
- లాంచ్ కి ముందు, ఐకూ 10 మోడల్ రియర్ డిజైన్ ను టీజ్ చేసిన కంపెనీ
ఐకూ 10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐకూ సిద్దమవుతోంది. జులై 19 న చైనాలో ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు, ఐకూ 10 ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లైవ్ షాట్స్, ప్రైస్ ట్యాగ్ వంటివి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచాయి. ఇప్పుడు ఐకూ 10 కూడా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఐకూ కంపెనీ ఐకూ 10 ఫోన్ యొక్క ఫస్ట్ లుక్ ని నేడు టీజ్ చేసింది. మరి ఐకూ 10 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం పదండి.
iQOO 10 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన ఐకూ కంపెనీ
పైన ప్రమోషనల్ పోస్టర్ లో ఐకూ 10 ఎలా ఉండనుందో అర్థమవుతోంది. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, వెనకాల సిగ్నేచర్ ఐకూ డిజైన్, బీఎండబ్ల్యూ స్ట్రిప్స్, భారీ కెమెరా మాడ్యూల్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఐకూ 10 డిజైన్, ఐకూ ఫోన్ లవర్స్ కి నచ్చే విధంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. త్వరలోనే కంపెనీ నుంచి వీడియో టీజర్ కూడా వస్తుందేమో చూడాలి.
ఇక వెనకవైపు క్రింది భాగం గ్లాస్ తో కవర్ అవ్వగా, పైన భాగం విభిన్నమైన ఫినిషింగ్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరాల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 20ఎక్స్ జూమ్ కెమెరా ప్రత్యేకం. కుడివైపున వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉన్నాయి. క్షుణ్ణంగా గమనిస్తే, ఐకూ 10 మెటల్ ఛాసిస్, యాంటినా లైనింగ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
iQOO 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 12జిబి ర్యామ్
- 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 50ఎంపి+12ఎంపి+13ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
ఐకూ 10 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ వంటి ఫీచర్లతో వస్తోంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుంది.
ఇక బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. ఐకూ 10 ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది. కెమెరా విభాగాన్ని చూస్తే, ఐకూ 10 ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఐకూ ఫ్యాన్స్ ఐకూ 10 సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఫోన్ చైనాలో ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో, ఫీచర్లు, ధరకు సంబంధించి క్లారిటీ రానుంది. అయితే భారత మార్కెట్ లో ధర, స్పెసిఫికేషన్లు ఏమైనా మారే అవకాశముందో చూడాలి.













