
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం గీక్బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy M55 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M55 5G బీఐఎస్ లిస్టింగ్
- Samsung Galaxy M55 5G బీఐఎస్ పై SM-M556B/DS అనే మోడల్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్ లో లిస్ట్ అయినందున త్వరలోనే భారత్ లో Samsung Galaxy M55 5G లాంచ్ అవుతుందని చెప్పవచ్చు.
- బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy M55 5G కి సంబంధించి స్పెసిఫికేషన్ వంటి ఏ ఇతర వివరాలు కూడా రివీల్ కాలేదు.
- రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి అధికార ప్రకటన వస్తుందని అంచనా వేయవచ్చు.
Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ 8జిబి ర్యామ్ తో రానుందని గీక్బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు. 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే సెన్సర్స్ ఉంటాయో ఇంకా తెలియదు.
- బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో గత మోడల్ ఎమ్54 మాదిరిగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది.
- ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.












