Realme 12 Pro, Pro+ తో పాటు Realme 12 Pro Max 5G లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • జనవరి 29న లాంచ్ అవుతోన్న Realme 12 Pro, 12 Pro Plus
  • Realme 12 Pro Max 5G కూడా లాంచ్ అయ్యే అవకాశం
  • హైలైట్ ఫీచర్: పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్

గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న Realme 12 Pro సిరీస్ జనవరి 29న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటితో పాటు, Realme 12 Pro Max 5G కూడా లాంచ్ అవుతుందని తాజాగా ఓ సమాచారం లీక్ అయ్యింది. ఈ డివైజ్ యొక్క మార్కెటింగ్ మెటీరియల్, స్పెసిఫికేషన్స్, ధరను ఓ టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro Max 5G ధర మరియు లాంచ్ వివరాలు

  • టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై Realme 12 Pro Max 5G యొక్క వివరాలను షేర్ చేశారు.
  • Realme 12 Pro Max 5G డివైజ్ భారత్ లో Realme 12 Pro సిరీస్ తో పాటు లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • తన పోస్ట్ లో టిప్‌స్టర్ Realme 12 Pro Max 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ షేర్ చేశారు.
  • Realme 12 Pro Max 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • Realme 12 Pro Max 5G 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.33,999 గా ఉంటుంది. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంటుందని అంచనా.