Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra

Highlights

  • భారత్‌లో లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Samsung Galaxy S24 Ultra ధర 1299 డాలర్లు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Samsung Galaxy S24 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 Ultra గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మరియు 200ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S24 Ultra ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra ధర

  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.1,29,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,39,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra డివైజ్ టైటానియమ్ గ్రే, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్సెట్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఉపయోగించారు.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ని ఈ ఫోన్ పొందనుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 ఫీచర్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 Ultra లో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.