OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R

Highlights

  • భారత్ లో లాంచైన OnePlus 12R
  • 4,500 నిట్స్ బ్రైట్నెస్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OnePlus 12 మరియు OnePlus 12R డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12R గురించి తెలుసుకుందాం. OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 12R పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర, లభ్యత

  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఓసారి వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • OnePlus 12R 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు.
  • OnePlus 12R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.45,999 గా ఉంది.
  • భారత్ లో OnePlus 12R సేల్ ఫిబ్రవరి 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
  • OnePlus 12R కొనుగోలుపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,250 విలువగల ప్రయోజనాలతో పాటు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి.
  • మొదటి 24 గంటల్లో OnePlus 12R ని ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ.4,999 విలువగల Buds Z2 ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది.
  • అలాగే OnePlus Pad కొనుగోలుపై రూ.3,000 డిస్కౌంట్ తో పాటు ఆర్‌సీసీ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది.
  • OnePlus 12R కస్టమర్లకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ 6 నెలలు, యూట్యూబ్ ప్రీమియమ్ 3 నెలల కాలపరిమితితో లభించనుంది.
  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12R లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12R లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Previous articleOnePlus: 2K డిస్ప్లేతో భారత్‌లో లాంచైన OnePlus 12
Next articleRealme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.