Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55 5G
  • ఎగ్జినోస్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • డిస్ప్లే: సూపర్ అమోలెడ్ పుల్ హెచ్డీ+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ వివరాలు

 

  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ SM-A5560 SM-A556E అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ రివీల్ అయ్యింది.
  • మరోవైపు రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ ద్వారా 2.77ఏ ఔట్‌పుట్ సపోర్ట్ గల 9వీ డీసీ
    అడాప్టర్ రివీల్ అయ్యింది.
  • అంతకు ముందు 3సీ సర్టిఫికేషన్ ద్వారా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఖరారైంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ గతంలో బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇక రెండర్స్ ద్వారా డిజైన్ కూడా లీక్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ ఇంకా Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.