
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Tecno Camon 30 Premier డివైజ్ ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Tecno Camon 20 Premier కి సక్సెసర్ గా Tecno Camon 30 Premier డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. త్వరలోనే Tecno Camon 30 Premier లాంచ్ ప్రకటన కంపెనీ నుంచి రానుంది. ఇప్పటికే ఈఈసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లో లిస్టైన Tecno Camon 30 Premier తాజాగా టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్

- Tecno Camon 30 Premier స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
- Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ రివీల్ అయ్యింది.
- Tecno Camon 30 Premier డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
- బ్యాటరీ, చార్జింగ్ పోర్ట్ వివరాలు తప్పా మిగతా స్పెసిఫికేషన్స్ ఏవీ టీయూవీ ద్వారా రివీల్ కాలేదు.
ఇక అంతకు ముందు గీక్‌బెంచ్ పై Tecno Camon 30 Premier డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 529 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1355 పాయింట్లు స్కోర్ చేసింది.
ఇంకా Tecno Camon 30 Premier డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. కానీ, టెక్నో ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ 14 తో తీసుకొచ్చే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ కాకుండా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ పొందిన మొదటి ఫోన్ గా Tecno Camon 20 Premier నిలిచింది. కాబట్టి, Tecno Camon 30 Premier కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుందని భావించవచ్చు.
ఇక బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై Tecno Camon 30 Premier డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో లిస్ట్ అయ్యింది.
Tecno Camon 30 Premier లాంచ్ తేదీ
Tecno Camon 30 Premier లాంచ్ తేదీని టెక్నో సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్టిఫికేషన్స్ ని బట్టి చూస్తే, డివైజ్ లాంచ్ సమీపిస్తోందని చెప్పవచ్చు. త్వరలోనే Tecno Camon 30 Premier పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ వెల్లడయ్యే అవకాశం ఉంది.











