Home News Airtel 319 vs Vodafone Idea 319: రెండింట్లో ఏది బెస్ట్ ప్లాన్

Airtel 319 vs Vodafone Idea 319: రెండింట్లో ఏది బెస్ట్ ప్లాన్

హైలైట్స్

భారతదేశంలో Airtel, Jio అగ్రశ్రేణి టెలీకామ్ ఆపరేటర్లుగా కొనసాగుతున్నాయి. ఇక Vodafone Idea మూడోస్థానంలో ఉంది. ఎయిర్టెల్, జియో లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వీఐ ఆఫర్ చేస్తోంది. మరోవైపు ఎయిర్టెల్ కూడా తన కస్టమర్ల కోసం విభిన్న తరహా రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తోంది.

ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు రూ.319 రీచార్జ్ ప్లాన్ ని తమ కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇరు సంస్థలు కూడా ఈ ప్లాన్ తో డెయిలీ డేటా, డెయిలీ ఎస్‌ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, ఎక్కువ వ్యాలిడిటీతో పాటు మరెన్నో అదనపు బెనిఫిట్స్ ని అందిస్తున్నాయి. మరి ఎయిర్టెల్, వీఐ అందిస్తోన్న రూ.319 ప్లాన్స్ లో ఏది ఉత్తమమో ఇక్కడ తెలుసుకుందాం.

Airtel 319 ప్లాన్

రూ.319 ధరతో లభిస్తోన్న ఈ ఎయిర్టెల్ ప్లాన్ తో డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ, ఇతర సేవలతో కూడిన ప్రయోజనాలు లభిస్తాయి. అన్నీ కలగలిసి ఉండే కాంబో ప్లాన్ కోరుకునే వారికి ఈ రూ.319 రీచార్జ్ ప్లాన్ సరైన ఎంపిక. ఎయిర్టెల్ కి నెట్వర్క్ కవరేజీ విషయంలో మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఈ కవరేజీ అనేది ఎయిర్టెల్ కి ప్రధాన బలం. సరే ఓసారి రూ.319 ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం.

రూ.319 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లు 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇంకా ప్రతిరోజు 2జిబి డేటా లభిస్తుంది. అలాగే ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటిని మీరు ఎస్టీడీ లేదా లోకల్ గా ఏ నెట్వర్క్ కి అయినా ఈ మేసెజ్ లను వాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.319 తో లభించే అదనపు ప్రయోజనాలను చూస్తే, మూడు నెలల వరకు అపోలో 24/7 సర్కిల్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సేవలను పొందవచ్చు.

Vodafone Idea రూ.319 ప్లాన్

వొడాఫోన్ ఐడియా అందిస్తోన్న రూ.319 రీచార్జ్ ప్లాన్ తో అపరిమిత కాల్స్ లభిస్తాయి. అలాగే డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. వ్యాలిడిటీ విషయానికి వస్తే, నెల రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటులో ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు వాడని డేటా శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ తో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు. మీకు నచ్చిన కంటెంట్ ని చూడవచ్చు. ఈ సమయంలో మీ ప్లాన్ నుంచి డేటా చార్జ్ కాదు. ఇంకా వీకెండ్ డేటా రోలోవర్ సౌకర్యం ఉంటుంది. అలాగే వీఐ మూవీస్ అండ్ టీవీ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంతేనా, ఇంకా ఉంది. ప్రతి నెలా 2జిబి వరకు ఉచిత బ్యాకప్ డేటా లభిస్తుంది. ఈ 2జిబి బ్యాకప్ డేటాని వీఐ యాప్ లేదా 121249 కి డయల్ చేసి పొందవచ్చు.

ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అందిస్తోన్న రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. రెండింట్లో ఏది ఉత్తమమో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అయితే బెనిఫిట్స్ తో పాటు నెట్వర్క్ కవరేజీని కూడా దృష్టిలో పెట్టుకుని మీకు నచ్చిన ప్లాన్ ని ఎంపిక చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.