హైలైట్స్
- STV 399 రీచార్జ్ ప్లాన్ తో 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న BSNL
- రూ.399 ప్లాన్ తో 28 రోజులు వ్యాలిడిటీ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్
- రూ.399 ప్లాన్ తో అదనపు ప్రయోజనాలను అందిస్తోన్న రెండు సంస్థలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ తో తన ప్రయివేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ వద్ద ఎన్నో చవకైన, ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్స్ ఉన్నాయి. ఇవే బీఎస్ఎన్ఎల్ ప్రధాన బలం. అయితే బీఎస్ఎన్ఎల్ ఇంకా 3జీ సేవలనే అందిస్తోంది. అతి త్వరలో 4జీ ఆ వెనువెంటనే 5జీ సేవలను లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టకుంది.
దేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఒకటిగా ఎయిర్టెల్ కొనసాగుతోంది. కవరేజీ అంటే ఎయిర్టెల్ అనే అనేంతగా జనాల్లో పేరు సంపాదించింది ఎయిర్టెల్. జియో రాకతో ఎయిర్టెల్ తన కస్టమర్లను కోల్పోయినప్పటికీ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు ఎయిర్టెల్ సంస్థ విభిన్న తరహా ప్లాన్స్ తో తన యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎయిర్టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది.
ఇప్పుడు ఎయిర్టెల్ మరియు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.399 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఏ సంస్థ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం.
Airtel 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
Airtel 399 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లు ప్రతిరోజు 2.5జిబి డేటా పొందుతారు. అలాగే ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ లేదా ఎస్టీడీ కాల్స్ ని ఉచితంగా చేసుకోవచ్చు. రోమింగ్ చార్జీలు కూడా పడవు. ఇంకా ఈ ప్లాన్ 28 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాదండోయ్, ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వ్యాలిడిటీ ముగిసే లోపు ఈ ఎస్ఎంఎస్ లను ఏ నెట్వర్క్ కి అయినా పంపుకోవచ్చు.
ఎస్ఎంఎస్ పరిమితి పూర్తయ్యాక, లోకల్ మెసేజ్ కి రూ.1, ఎస్టీడీ మెసేజ్ కి రూ.1.50 చార్జ్ చేయబడుతుంది. అలాగే డెయిలీ డేటా లిమిట్ ముగిసాక డేటా వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.
అదనపు ప్రయోజనాలు
Airtel 399 ప్లాన్ ద్వారా 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్ట్‌ట్యాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
BSNL 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
BSNL 399 ప్లాన్ రీచార్జ్ చేసే కస్టమర్లకు 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతిరోజు 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 1జిబి డేయిలీ డేటా పరిధి ముగిశాక, ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అప్పుడు ఉచితంగా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు.
అదనపు ప్రయోజనాలు
BSNL 399 ప్లాన్ తో పలు అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ప్లాన్ ద్వారా ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా లోక్‌దన్ కంటెంట్ ని ఉచితంగా పొందవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.