ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి.
ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటాతో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అంతేకాదు, ఉచిత రూటర్ ని కూడా కంపెనీ అందిస్తోంది. మరి ఈ ప్లాన్ తీరుతెన్నులు, ఇతర చార్జీలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో క్రింద వివరంగా ఇచ్చాం. ఓసారి చదివేయండి.
- రూ.199 ప్లాన్ ద్వారా అపరిమిత డేటా లభిస్తుంది. ఇంకా 10ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.
- కస్టమర్లు ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్ ని 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది. దానికి యూజర్లు జీఎస్టీ తో కలుపుకుని మొత్తం రూ.1174 చెల్లించాల్సి ఉంటుంది.
- దీంతో పాటు కస్టమర్లు ఈ ప్లాన్ కోసం రూ.500 ఇన్స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.
- ఈ ప్లాన్ ని కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ ఉచితంగా రూటర్ ని అందించనుంది.
ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై
ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా తో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.
- ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ 10ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుంది.
- ఎక్స్‌ట్రిమ్ బాక్స్, ఉచిత వై-ఫై రూటర్ మరియు 350 కి పైగా టీవీ చానల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
- ఈ ప్లాన్ ని కూడా కస్టమర్లు కనీసం 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది.
- వన్ టైమ్ ఇన్స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కలుపుకుని ఈ ప్లాన్ ధర రూ.3,000 అవుతుంది.
రెండు ప్లాన్లలో కాలింగ్ ఉచితం
కంపెనీ అందించే డేటాతో పాటు, ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాదు, ప్లాన్ లో అందుబాటులో ఉన్న ఇతర స్పీడ్స్ కి ఎప్పుడైనా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అంటే మీ ప్లాన్ ని మీకు నచ్చినప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఎయిర్టెల్ తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొకసారి ప్లాన్ల ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపోయే ప్లాన్ ఏదో దానిని ప్రయత్నించండి.
