Home News Airtel vs Jio: ఏది ఉత్తమమైన డెయిలీ 3GB డేటా ప్లాన్ అందిస్తోంది?

Airtel vs Jio: ఏది ఉత్తమమైన డెయిలీ 3GB డేటా ప్లాన్ అందిస్తోంది?

హైలైట్స్

Jio రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

జియో వివిధ డేటా మరియు కాలింగ్ ప్లాన్స్ ని అందిస్తోంది. అయితే డేటాతో కూడిన కాలింగ్ ప్లాన్స్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకోసం జియో రూ.419 ప్లాన్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. రూ.419 రీచార్జ్ ప్లాన్ ద్వారా 3జిబి డేటాతో పాటు, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లు పైన పేర్కొనబడిన బెనిఫిట్స్ తో పాటు మరిన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్యాక్ తో జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి వాటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Jio Rs.419 ప్లాన్ బెనిఫిట్స్

Airtel రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ లో వివిధ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత కాలింగ్, డెయిలీ 3జిబి డేటా అందించే ప్లాన్ మాత్రం ఇదే. ఇంతకంటే తక్కువ ధరలో ఈ తరహా బెనిఫిట్స్ ఇచ్చే మరొక ఎయిర్టెల్ ప్లాన్ లేదు. రూ.599 ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే డెయిలీ 3జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

రూ.599 ప్లాన్ ని రీచార్జ్ చేసే వారికి ప్రతిరోజూ 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఈ ప్లాన్ తో లభిస్తుంది. ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాప్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel Rs.599 ప్లాన్ బెనిఫిట్స్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.