Home News రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel

రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel

హైలైట్స్:

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోని అన్ని టెలీకామ్ కంపెనీలు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లను విడుదల చేస్తున్నాయి. జియోో తర్వాత తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. రూ.519, రూ.779 విలువ గల ఈ ప్లాన్స్ ప్రస్తుతం భారతీయ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ కూడా ప్రతిరోజు 1.5జిబి డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు, తదితర ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఎయిర్టెల్ వెబ్ సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ రెండు ప్లాన్స్ లో తమకు నచ్చిన ప్లాన్ ని ఎంచుకుని, రీచార్జ్ చేసుకోవచ్చు.

Airtel రూ.519 ప్రీపెయిడ్ ప్లాన్

ఇటీవలె ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ రూ.519 ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ ని విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 60 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 1.5జిబి డేటా వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి. మొత్తంగా ఈ ప్లాన్ ద్వారా 90జిబి డేటా లభిస్తుంది. కాగా, ఇంటర్నెట్ స్పీడ్ డెయిలీ డెటా లిమిట్ తర్వాత 64కేబీపీఎస్ కి పడిపోతుంది. ఇక ఇతర బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ నుంచి వచ్చిన మరొక ప్లాన్ రూ.799 రీచార్జ్ ప్లాన్. ఇది మొత్తంగా 135జిబి డేటాను అందిస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్, ప్రతిరోజు 100ఎస్ఎంఎస్ లు మరియు 1.5జిబి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఇక అదనపు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఇక ఇతర బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

5జీ స్పెక్ట్రమ్ వేలం సందర్భంగా టెలీకామ్ సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి పడటంతో, 4జీ డేటా ప్లాన్స్ ధరలు పెరుగుతున్నాయన్న చర్చల నేపథ్యంలో తాజాగా ఈ ప్లాన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా 5,000 పట్టణాలకు 5జీ సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. 2024 మార్చి కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని సదరు సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఏడాది కొన్ని ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు మొదలు కానున్నాయి.

ఇక 4జీ ప్లాన్స్ తో పోలిస్తే, 5జీ ప్లాన్ ధరలు ఎక్కువుంటాయని టెలీకామ్ సంస్థలు చెబుతూ వస్తున్నాయి. 4జీ కంటే 30 శాతం మేర ఎక్కువగా 5జీ ప్లాన్ ధరలు ఉంటాయని సమాచారం.