హైలైట్స్
- కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Airtel
- గతంలో కూడా రూ.199 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
- తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ ని పరిచయం చేస్తోన్న దిగ్గజ టెలీకామ్ కంపెనీ
భారత దేశంలో దిగ్గజ టెలీకామ్ కంపెనీ అయిన Airtel తాజాగా రూ.199 విలువజేసే ప్రీపెయిడ్ ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. 2021 లో టారిఫ్ పెరగక ముందు ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ పై 24 రోజుల వ్యాలిడిటీ మరియు 1జిబి డెయిలీ డేటాను అందించింది. తర్వాత జియో 1.5జిబి ఆఫర్ చేస్తుండటంతో, ఎయిర్టెల్ కూడా 1.5జిబి డెయిలీ డేటా ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కి మార్పులు చేసింది. రూ.199 ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది.
Airtel రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా Airtel రూ.199 ప్లాన్ ని వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. యూజర్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ఏకమొత్తంగా 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. అంతేకాదండోయ్ ఈ ప్లాన్ తో 300 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. ఇంకా ఎయిర్టెల్ థాంక్స్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు యూజర్లు పొందవచ్చు.
ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉపయోగించుకున్న తర్వాత ఒక లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఒక ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 ఖర్చవుతుంది. ఇక డేటా విషయానికి వస్తే, 1 ఎంబి కి 50 పైసలు ఖర్చవుతుంది. వాడుకోని డేటా, ఎస్ఎంఎస్ లు ప్లాన్ ముగియు రోజున ఎక్స్‌పైర్ అవుతాయి. అదే ప్లాన్ ని మళ్ళీ రీచార్జ్ చేసినప్పటికీ వాడబడని డేటా, ఎస్ఎంఎస్ లు క్యారీ ఫార్వార్డ్ చేయబడవు. కాబట్టి ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.
ఇటీవలి కాలంలో Airtel నుంచి కొత్త ప్లాన్స్ ఏమీ రాలేదు. తాజాగా వచ్చిన రూ.199 ప్లాన్ ఓ వర్గం యూజర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా ఈ రీచార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తుండటం విశేషం. వ్యాలిడిటీతో పాటు నామమాత్రపు డేటా, ఎస్ఎంఎస్ లు కావాలని కోరుకునే వారికి ఈ ఆఫర్ సరైందని చెప్పవచ్చు. మీరు గనుక రూ.200 లోపు ఒక చక్కటి రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రయత్నించండి.
Airtel రూ.199 ప్లాన్ బెనిఫిట్స్
- 30 రోజుల వ్యాలిడిటీ
- 3జిబి ఏకమొత్తం డేటా
- 300 ఏకమొత్తం ఎస్ఎంఎస్
- అపరిమిత కాలింగ్
- థాంక్స్ యాప్, వింక్ మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్స్ ప్రయోజనాలు
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.