భారత్ లోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రధానంగా ఈ సంస్థకి జియో నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జియో ని ఎదుర్కునేందుకై ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం సమయానుసారం తీసుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ వద్ద ఎన్నో బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. డేటా ప్రధానమైనవి, వ్యాలిడిటీ ప్రధానమైనవి ప్లాన్స్ ఎయిర్టెల్ దగ్గర ఉన్నాయి.
ఇప్పుడు మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ, డేటా, ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాదండోయ్ ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సరే, ఓసారి ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి లభించే పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.
Airtel రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
- 30 రోజుల వ్యాలిడిటీ
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
- 25జిబి డేటా
- ఉచిత కాలింగ్
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా 25జిబి డేటా యూజర్ కి లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ని ఉచితంగా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. వంద ఎస్ఎంఎస్ ల పరిధి దాటాక సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి. డేటా వినియోగం కూడా పరిధి దాటాక ఒక ఎంబికి 50 పైసలు చార్జ్ ఖర్చవుతాయి. ఇప్పుడు ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
Airtel రూ.296 అదనపు ప్రయోజనాలు
- అపోలో 24/7 సర్కిల్
- ఫాస్టాగ్ రూ.100 క్యాష్ బ్యాక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఉచిత వింక్ మ్యూజిక్
ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ, డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. రూ.296 ప్లాన్ ద్వారా యూజర్ కి అపోలో 24/7 సర్కిల్ సేవలు 3 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఉచిత హలో ట్యూన్స్ తో పాటు వింక్ మ్యూజిక్ ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను గురించి తెలుసుకున్నారు కదా? మరొకసారి ఈ ప్లాన్ వివరాలను చదివి, మీకు సరిపోయేదైతే రీచార్జ్ చేసుకుని ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి. ఒక నెల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. డేటా కూడా 25జిబి లభిస్తుంది. ఓ మోస్తరుగా డేటాను వాడే వారికి ఇది ఉపయోగపడుతుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
