Home News Airtel రూ.359 ప్లాన్: SonyLiv తో పాటు మరెన్నో బెనిఫిట్స్

Airtel రూ.359 ప్లాన్: SonyLiv తో పాటు మరెన్నో బెనిఫిట్స్

Highlights
  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ అందిస్తోన్న ఎయిర్టెల్ సంస్థ
  • రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ తో సోని లివ్ యాప్ తో పాటు డేటా, కాలింగ్ మరెన్నో లాభాలు
  • ప్లాన్ ద్వారా లభించనున్న 2జిబి డెయిలీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ ఇంకా ఎన్నో ప్రయోజనాలు

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం ఎయిర్టెల్ కి జియో సంస్థతో గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ సంస్థ యూజర్ల కోసం ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్స్ ని తీసుకొస్తోంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్స్ తో ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో ముందుంది. అయితే ఎయిర్టెల్, జియోలు 5జీ నెట్వర్క్ ని అందిస్తుండటం సదరు సంస్థలకు ప్రధాన బలం. బీఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే ఇంకా 4జీ సేవలను విస్తరించే దశలోనే ఉంది.

ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని యూజర్ల కోసం అందిస్తోంది. వాటి ద్వారా యూజర్లకు ఎన్నో బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇప్పుడు మనం రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్ కి అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్, డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. సరే, ఓసారి రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా లభించే పూర్తి లాభాలేంటో తెలుసుకుందాం పదండి.

Airtel రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

ఎయిర్టెల్ రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ తో ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. డెయిలీ ఎస్ఎంఎస్ పరిధి ముగిసాక సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. అంటే మొత్తం 28 రోజులకు 56జిబి డేటా యూజర్ కి లభిస్తుంది. ఇప్పుడు రూ.359 ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Airtel రూ.359 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.359 ప్లాన్ తో డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, కాల్స్ తో పాటు అదనంగా Xtream App కి యాక్సెస్ లభిస్తుంది. 28 రోజుల పాటు ఈ యాక్సెస్ చెల్లుబాటు అవుతుంది. సోనిలివ్, లయన్స్‌గేట్‌ప్లే, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమమ్యాక్స్, చౌపల్, కాంచాలంకా వంటి చానల్స్ లో ఏదైనా ఒకదానికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

అంతేకాదండోయ్.. ఎయిర్టెల్ రూ.359 ప్లాన్ తో ఇంకా అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. వీటితో పాటు వింక్ మ్యూజిక్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.