
భారతదేశంలోని ప్రధాన టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం ఎయిర్టెల్ సంస్థ తన 5జీ సేవలను విస్తరింపజేయడంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్, 2023 పూర్తయ్యే నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్టెల్ తన యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోంది. తాజాగా పెద్దగా హడావుడి లేకుండా రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.
ఎయిర్టెల్ సంస్థ తాజాగా రూ.489 మరియు రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ ద్వారా యూజర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు ఎస్ఎంఎస్, డేటా, కాలింగ్ వంటి ఇతర ప్రయోజనాలెన్నో లభిస్తాయి. సరే, ఓసారి రెండు ప్లాన్స్ ద్వారా లభించే పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Airtel రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
- 30 రోజుల వ్యాలిడిటీ
- 50జిబి డేటా
- 300 ఎస్ఎంఎస్
- అపరిమిత కాలింగ్
ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. అలాగే 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ తో 50జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 30 రోజలు వ్యాలిడిటీని యూజర్స్ పొందుతారు.
ఎయిర్టెల్ రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
- అపోలో 24/7 సర్కిల్
- ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఉచిత వింక్ మ్యూజిక్ యాక్సెస్
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.489 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటంటే, యూజర్ కి వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ సేవలు 3 నెలలు ఉచితంగా పొందవచ్చు. ఇంకా ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి.
Airtel రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
- 30 రోజుల వ్యాలిడిటీ
- అపరిమిత కాలింగ్
- 300 ఎస్ఎంఎస్
- 60జిబి హై-స్పీడ్ డేటా
ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఏ నెట్వర్క్ కి అయిన ఇది వర్తిస్తుంది. ఇంకా 300 ఎస్ఎంఎస్, 60జిబి హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ఎయిర్టెల్ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
- 3 నెలలు పాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్ సేవలు
- ఉచిత వింక్ మ్యూజిక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ సేవలు ఉచితంగా పొందవచ్చు. అలాగే ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











