భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం అందిస్తోంది. దీంతో ఎయిర్టెల్ వైపు జనాలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ ట్యాలీ లిస్ట్ లో ఎయిర్టెల్ లక్షల్లో సబ్‌స్క్రైబర్లను పొందినట్లు తెలిసింది. అయితే ఎయిర్టెల్ కంటే అత్యధిక యూజర్ బేస్ తో జియో సంస్థ ముందుంది. ఏదేమైనా జియో, ఎయిర్టెల్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది.
సరే, ఇప్పుడు Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా డెయిలీ డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓసారి రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.
Airtel రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
- 28 రోజుల వ్యాలిడిటీ
- డెయిలీ 3జిబి డేటా
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
- ఉచిత కాలింగ్
Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 3జిబి డేటా లభిస్తుంది. అలాగే డెయిలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎయిర్టెల్ రూ.499 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Airtel రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
- ఎక్స్‌ట్రిమ్ యాప్
- డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్
- అపోలో 24/7 సర్కిల్
- ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఉచిత వింక్ మ్యూజిక్
Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు, అదనంగా రూ.149 విలువగల డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ కి 3 నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇంకా ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇంకా ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
Airtel రూ.499 ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొక్కసారి ప్లాన్ ప్రయోజనాలను చదివి, మీకు సరిపోయేదైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
