Airtel రూ.699 ప్లాన్: Amazon Prime తో పాటు మరెన్నో బెనిఫిట్స్

హైలైట్స్

  • ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.699 ప్లాన్ లభించనున్న 56 రోజుల వ్యాలిడిటీ
  • ఈ ప్లాన్ రీచార్జ్ పై అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితం
  • సోనిలివ్, లయన్ గేట్ ప్లే, ఇరోజ్ నౌ, హొయ్ చొయ్, మనోరమమ్యాక్స్, చౌపల్, కాంచా లాంకా చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. జియో, ఎయిర్టెల్ కంపెనీల నడుమ ప్రధానంగా పోటీ ఉంటోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా మూడోస్థానంలో ఉండగా, జియో, ఎయిర్టెల్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం చివరి స్థానంలో ఉన్నప్పటికీ, త్వరలోనే పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అత్యంత జనాదరణ పొందిన ఎయిర్టెల్ టెలీకామ్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్లకు అందిస్తోంది. వాటిలో నుంచి ఇప్పుడు మనం రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు, అదనపు ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా డేటా, అపరిమిత కాల్స్, వాలిడిటీ తో పాటు అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. సరే, ఓసారి రూ.699 ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 56 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 3జిబి డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాల్స్
  • అమెజాన్ ప్రైమ్ ఉచిత సభ్యత్వం
  • ఎక్స్‌ట్రిమ్ యాప్ బెనిఫిట్స్
  • అపోలో 24/7 సర్కిల్ సేవలు
  • ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్
  • ఉచిత హలో ట్యూన్స్
  • వింక్ మ్యూజిక్ యాక్సెస్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.699 ప్లాన్ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా ప్రతి రోజూ 3జిబి డేటా లభిస్తుంది. ఇప్పుడు రూ.699 ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రూ.699 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.699 ప్లాన్ ద్వారా ఎన్నో అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. రూ.699 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్, వ్యాలిడిటీ బెనిఫిట్స్ తోపాటు, అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా ఎక్స్‌ట్రిమ్ యాప్ లో సోని లివ్, లయన్స్ గేట్ ప్లే, ఇరోజ్ నౌ, హొయ్ చొయ్, మనోరమా మ్యాక్స్, చౌపల్, కాంచా లాంకా వంటి చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంటే 56 రోజుల పాటు ఈ చానల్స్ ఓ ఒక దానిని మీరు ఉచితంగా పొందవచ్చు.

అంతేకాదండోయ్, ఇంకా అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ ‌బ్యాక్ పొందవచ్చు. ఇంకా, ఉచిత హలోట్యూన్స్ తో పాటు వింక్ మ్యూజిక్ ని ఉచితంగా పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్
Next article6GB ర్యామ్, Dimensity 700 చిప్ తో లాంచైన Samsung Galaxy A14 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.