
భారతదేశంలో ఉన్న దిగ్గజ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. జియో రాకతో కొంత తడబడినప్పటికీ, మళ్ళీ తన యూజర్ బేస్ ని పెంచుకుని జియోకి గట్టి పోటీనిస్తూ దూసుకెళ్తోంది ఎయిర్టెల్ సంస్థ. ఇక తన యూజర్ల కోసం ఎయిర్టెల్ వద్ద ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ఉన్నాయి. ఓటీటీ కంటెంట్ ని ఎక్కువగా వీక్షించే వారి కోసం ఎయిర్టెల్ వద్ద అద్భుతమైన కాంబో ప్లాన్స్ ఉన్నాయి. అందులో రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి.
రూ.719 ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఓటీటీకి 3 నెలల పాటు ఉచిత యాక్సెస్ ని పొందవచ్చు. రూ.149 విలువజేసే ఈ ప్లాన్ ద్వారా లైవ్ స్పోర్ట్స్, మూవీస్, ఎక్స్‌క్లూజివ్ హాట్‌స్టార్ స్పెషల్స్ తదితర కంటెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు. సరే, ఓసారి రూ.719 ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
Airtel రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
- 84 రోజుల వ్యాలిడిటీ
- అపరిమిత కాల్స్
- డెయిలీ 1.5జిబి డేటా
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 1.5జిబి డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా లోకల్, ఎస్టీడీ కాల్స్ ని ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. 100 ఎస్ఎంఎస్ ల వినియోగం పూర్తయ్యాక, సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి.
Airtel రూ.719 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
- 3 నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మెంబర్షిప్
- ఎక్స్‌ట్రిమ్ యాప్ యాక్సెస్
- రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్
- అపోలో 24/7 సర్కిల్
- ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఉచిత వింక్ మ్యూజిక్
ఎయిర్టెల్ రూ.719 ప్లాన్ ద్వారా డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ, కాల్స్ వంటి ప్రయోజనాలే కాకుండా మరిన్ని లాభాలు కూడా ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాప్ కి 3 నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇంకా ఎక్స్‌ట్రిమ్ యాప్ లో సోనిలివ్, హొయిచొయ్ వంటి 5 చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. హొయిచొయ్ చానల్ లోని కంటెంట్ ని వీక్షించడం ద్వారా ఐఫోన్ 14 ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
అంతేకాదండోయ్, రూ.719 ప్లాన్ తో ఇంకా రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ సేవలు 3 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ కి ఉచిత యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











