హైలైట్స్
- ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లో కొనసాగుతోన్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్
- సేల్ లో భాగంగా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్
- ఫెస్ట్ లో సేల్ అవుతోన్న టాప్ 5 ఫోన్స్ ఇవే: Samsung Galaxy M13, Redmi 10A, Realme Narzo 50A, iQOO Z6 Lite, Redmi A1,
నవంబర్ 26 న అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ లో భాగంగా వివిధ హ్యాండ్సెట్స్ పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. శాంసంగ్, రియల్మీ, రెడ్మీ, ఐకూ తదితర బ్రాండ్స్ పై తగ్గింపు ధరలు, ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఇక్కడ మీకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో అత్యధికంగా అమ్ముడవుతోన్న ఫోన్ల జాబితాను అందిస్తున్నాం ఓ కన్నేయండి.
iQOO Z6 Lite
ఇప్పటికి iQOO Z6 Lite ఫోన్లు 1.5 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.13,999 కి లభిస్తోంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ కి ఈ ధర వర్తిస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5జీ కనెక్టివిటీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్, 50ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Samsung Galaxy M13
Samsung Galaxy M13 కి ఎంట్రీ-లెవెల్ ఫోన్ కేటగిరీలో భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికి ఈ డివైజ్ 2 మిలియన్ల యూనిట్లకు పైగా అమ్ముడైంది. ఈ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా ప్రస్తుతం రూ.10,499 కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపుకుంటే ఈ ఫోన్ ని రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ర్యామ్ ప్లస్ ఫీచర్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Realme Narzo 50A
Realme Narzo 50A స్మార్ట్ ఫోన్ ఇప్పటికి 10 లక్షల యూనిట్స్ కి పైగా అమ్ముడయ్యాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, ప్రస్తుతం రూ.11,499 కే లభిస్తోంది. కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఈ ఫోన్ రూ.9,499 కే మీ సొంతం అవుతుంది.
Redmi A1
Redmi A1 అత్యంత తక్కువ ధర కలిగిన డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ.6,999 కాగా, ప్రస్తుతం రూ.6,499 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కూడా కలిపితే, ఈ ఫోన్ ని మీరు రూ.5,849 కే సొంతం చేసుకోవచ్చు.
Redmi 10A
Redmi 10A 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.9,499 కాగా, ప్రస్తుతం రూ.8,499 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.7,649 కే మీ సొంతం చేసుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.