ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ని అనౌన్స్ చేసింది. ఈ సేల్ మే 4 నుంచి మొదలుకానుంది. సేల్ సందర్భంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తో పాటు మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కూడా ప్రారంభం కానుంది. ఇక అమెజాన్ సేల్ లో మొబైల్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. వన్‌ప్లస్, రియల్మీ, శాంసంగ్, ఐకూ, ఒప్పో, షావోమి ఫోన్ల డిస్కౌంట్ రివీల్ అయ్యాయి. అమెజాన్ సైట్ లో స్మార్ట్ ఫోన్లపై ఉన్న డీల్ వివరాలను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: స్మార్ట్ ఫోన్ డీల్స్
అమెజాన్ సేల్ గురించి మాట్లాడితే, iQOO Neo 6 5G పై రూ.1000 డిస్కౌంట్ తో ప్రస్తుత ధర రూ.23,999 గా ఉంది. అలాగే సేల్ సందర్భంగా iQOO Z6 Lite 5G ని రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. రూ.3500 డిస్కౌంట్ ఈ ఫోన్ పై లభిస్తోంది.
వన్‌ప్లస్ సంస్థ కూడా సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. మిడ్ రేంజ్ ఫోన్లు OnePlus Nord 2T, Nord CE 2 Lite 5G ఫోన్లపై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు ఒప్పో సంస్థ F21s Pro పై రూ.1500 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రియల్మీ ఫోన్లపై రూ.2,000 వరకు, రెడ్మీ ఫోన్లపై రూ.4250 వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ సంస్థ సేల్ సందర్భంగా బిగ్గెస్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. Galaxy S20 FE 5G స్మార్ట్ ఫోన్ పై రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా గెలాక్సీ ఎమ్ సిరీస్ ఫోన్లపై రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ లభించే స్మార్ట్ ఫోన్ల జాబితా అందిస్తున్నాం. ఓ కన్నేయండి.
మరింకెందుకు ఆలస్యం? మీరు స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే గనుక, వెంటనే ఆఫర్స్ లిస్ట్ చెక్ చేయండి. మీ బడ్జెట్ కి సరిపోయే ఫోన్ ని ఎంచుకుని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడంతా 5జీ ఫోన్ల వెంట పడుతున్నారు కాబట్టి, మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్న 5జీ డివైజ్ ని ఎంపిక చేసుకోండి. అలాగే మీరు గనుక ఫోటోగ్రఫీ ప్రియులైతే, కెమెరా విభాగాన్ని చెక్ చేయండి. గేమింగ్ అంటే ఇష్టమైతే ప్రాసెసర్ పై ఓ లుక్ వేయండి. ఫోన్ ని అధికంగా వాడితే గనుక బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ స్పీడ్ పై దృష్టిపెట్టండి. ఇలా మీ అవసరాలకు అనుగుణంగా మీ ఫోన్ ఎంపిక అనేది ఉండేలా చూసుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
