Home News 107 కిలోమీటర్ల రేంజ్ తో భారత్‌లో లాంచైన Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్

107 కిలోమీటర్ల రేంజ్ తో భారత్‌లో లాంచైన Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్

Highlights
  • భారత్ లో లాంచైన Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్
  • Ampere Primus ఈ-స్కూటర్ రేంజ్ 100 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 77కేఎంపీహెచ్
  • వచ్చే నెల నుంచి మొదలు కానున్న డెలివరీ; రూ.499 టోకేన్ అమౌంట్ తో మొదలైన ప్రీ-ఆర్డర్స్

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2023/02/Ampere-Primus.jpg

Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 107 కిలోమీటర్ల రేంజ్, 77కేఎంపీహెచ్ టాప్-స్పీడ్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఎల్సీడీ స్క్రీన్, ఎల్ఈడీ లైట్స్, రివర్స్ మోడ్, త్రీ రైడింగ్ మోడ్స్ (పవర్, సిటీ, ఇకో) వంటి ఫీచర్లు ఈ స్కూటర్ లో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో Ampere Primus ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. సరే, ఓసారి Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Ampere Primus ధర, లభ్యత

Ampere Primus భారత్ లో లాంచైంది. వచ్చే నెల నుంచి కంపెనీ యొక్క డీలర్షిప్స్ వద్ద బండ్ల అమ్మకాలు మొదలవుతాయి. Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,10,000 గా ఉంది. Ampere Primus రిజర్వేషన్స్ రూ.499 ఆన్‌లైన్ రుసుముతో అందుబాటులో ఉన్నాయి. లేదంటే కంపెనీ డీలర్షిప్స్ ద్వారా కూడా బండిని బుక్ చేసుకోవచ్చు.

Ampere Primus టూ-టోన్ డిజైన్, మ్యాట్ ప్యానెల్స్ తో వస్తోంది. ఈ బండి నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: హిమాలయన్ వైట్, హావ్‌లాక్ బ్లూ, బక్ బ్లాక్, రాయల్ ఆరెంజ్.

Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్

Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4 కిలోవాట్ పవర్ గల మోటర్ ఉంటుంది. ఆంపియర్ కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం, Ampere Primus స్కూటర్ టాప్ స్పీడ్ 77 కేఎంపీహెచ్. 0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగం చేరుకునేందుకు ఈ బండి 4.2 సెకన్ల సమయం తీసుకుంటుంది. రివర్స్ మోడ్ తో పాటు, ఆంపియర్ ప్రైమస్ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి: పవర్, సిటీ మరియు ఇకో.

Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ అవర్ లిథియమ్-ఐరన్-ఫాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, 107 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అయితే, కంపెనీ కచ్చితమైన గణాంకాలను అందించలేదు. కేవలం ఇకో మోడల్ లో మాత్రమే రేంజ్ ఎక్కువగా వస్తుంది. ఇకపోతే 5ఏ ఔట్‌లెట్ ద్వారా చార్జింగ్ చేస్తే బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Ampere Primus ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బండిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నేవిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్స్ (ఆంపియర్ యాప్ ద్వారా) ఉంటాయి. రెండు వీల్స్ డ్రమ్ బ్రేక్స్ తో వస్తున్నాయి. అలాగే ఒక రియర్ స్ప్రింగ్, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. స్టైలింగ్ ఫీచర్ల విషయానికి వస్తే, స్టెప్-అప్ సీట్, సింగిల్-పీస్ పిలియన్ గ్రాబ్‌రేట్, ఏప్రన్-మౌంటెడ్ ఫ్రంట్ టర్న్ ఇండికేటర్, టాల్ హెడ్‌లైట్ ఈ బండిలో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.