ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో ఎన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయో ఇంకా తెలియదు. అయితే తొలుత iPhone Flip లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా ఐఫోన్ ఫ్లిప్ కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.
iPhone Flip వివరాలు (లీక్)
లీక్ ప్రకారం, ఆపిల్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది బుక్ మాదిరి ఫోల్డబుల్ ఫోన్ కాదు. కానీ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్.
రిపోర్ట్ ప్రకారం, ఈ కొత్త ఆపిల్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ 2026 లో లాంచ్ అవుతుందని సమాచారం.
ఆపిల్ బ్రాండ్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల డిస్ప్లేలను శాంసంగ్ నుంచి కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే తన రెగ్యులర్ ఫోన్లకు ఆపిల్ కంపెనీ శాంసంగ్ నుంచి స్క్రీన్స్ కొనుగోలు చేస్తోంది.
రిపోర్ట్ ప్రకారం, iPhone Flip యొక్క డైమెన్షన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపిల్ ఫోన్ల మాదిరే ఉంటాయని తెలుస్తోంది. అయితే మందం మాత్రం ఎక్కువగా ఉంటుందని సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
iPhone 15 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.
ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.
కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
