హైలైట్స్
- iPhone SE 4 స్మార్ట్ ఫోన్ పై పని చేస్తున్న ఆపిల్ సంస్థ, 2023 లో లాంచ్ కానున్న బడ్జెట్ ఆపిల్ ఫోన్
- 6.1-ఇంచ్ డిస్ప్లే తో నాచ్ డిజైన్ తో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్
- పవర్/లాక్ బటన్ లో టచ్ ఐడీని తీసుకురానున్న ఆపిల్
ఫోర్త్ జనరేషన్ లో-కాస్ట్ ఐఫోన్ పై ప్రస్తుతం ఆపిల్ పని చేస్తోంది. iPhone SE 4 అనే పేరుతో రాబోవు ఈ ఫోన్ వచ్చే ఏడాది లాంచ్ కానుంది. ఈసారి డిజైన్ ని పూర్తిగా మార్చుకుని వస్తోంది iPhone SE 4 స్మార్ట్ ఫోన్. అలాగే పవర్ బటన్ లో ఇంటిగ్రేట్ చేయబడిన టచ్ ఐడీ తో వస్తుండటం విశేషం. ప్రముఖ టిప్‌స్టర్, యూట్యూబర్ జాన్ ప్రొసర్ iPhone SE 4 స్మార్ట్ ఫోన్ యొక్క రెండర్స్ ని రివీల్ చేశాడు. ఈ రెండర్స్ ని చూస్తే, iPhone SE 4 స్మార్ట్ ఫోన్ అచ్చంగా ఐఫోన్ ఎక్స్ఆర్ లాగా కనిపిస్తోంది.
భారీ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తోన్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్
టచ్ ఐడీ తో కూడిన డిజైన్ ని పక్కనబెట్టేసిన ఆపిల్ ఈసారి తీసుకురాబోతున్న iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ని రీడిజైన్ చేశారు. ఫుల్ స్క్రీన్ డిజైన్ కోసం టచ్ ఐడీని తొలగించడం జరిగింది. అలాగే ఈసారి రాబోవు హ్యాండ్సెట్ 6.1-ఇంచ్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. దీంతో పాత వర్షన్స్ లో కనిపించే 4.7-ఇంచ్ డిస్ప్లేకి గుడ్ బై చెప్పినట్లే.
టిప్‌స్టర్ ప్రోసర్ చెబుతున్న దాన్ని బట్టి, iPhone SE 4 చూడటానికి ఐఫోన్ ఎక్స్ఆర్ లాగా ఉంది. ఐఫోన్ ఎక్స్ఆర్ 2018 అక్టోబర్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ డిజైన్ చూస్తే, కర్వ్డ్ అల్యూమినియమ్ సైడ్ రెయిల్ కలిగి ఉంటుంది. ముందు వెనకాల గ్లాస్ ప్యానెల్ ఉంటాయి. టాప్ లెఫ్ట్ కార్నర్ లో సింగిల్ మెయిన్ కెమెరా లెన్స్ ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ బాడీ ఫ్రేమ్ పై కొత్త ఇంటర్నల్ కంపోనెంట్స్ తో iPhone SE 4 స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు అర్థమవుతోంది.
iPhone SE 4 స్మార్ట్ ఫోన్ ముందు వైపు నాచ్ డిజైన్ కలిగి ఉంటుంది. టచ్ ఐడీ సిస్టమ్ ని మళ్ళీ తీసుకొస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ టచ్ ఐడీని సైడ్ మౌంటెడ్ పవర్/లాక్ బటన్ లో ఇంటిగ్రేట్ చేయనున్నారని సమాచారం. iPhone SE 4 స్మార్ట్ ఫోన్ యొక్క ఇంటర్నల్ హార్డ్‌వేర్ గురించి ఇంకా వివరాలు తెలియలేదు. iPhone SE 4 స్మార్ట్ ఫోన్ లో ఆపిల్ తన యొక్క టాప్ టైర్ లేటెస్ట్ ప్రాసెసర్స్ లో ఒకదాన్ని వాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ చిప్సెట్ ని ఆపిల్ ఎంచుకుంటుందో చూడాలి. ఏదేమైనా లో-బడ్జెట్ సెగ్మెంట్ లో మార్కెట్ లేని ఆపిల్ ఈసారి ఐఫోన్ ఎస్ఈ4 ఏ సెక్షన్ ని టార్గెట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఆపిల్ లో తక్కువ బడ్జెట్ ఫోన్ అయినా సరే, అది ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీమియమ్ మిడ్ రేంజ్ ఫోన్ అంత ధర పలుకుతుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.