త్వరలోనే ASUS ROG Phone 7 డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత మార్కెట్ లో ప్రవేశించడానికి ముందు ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం ఈ డివైజ్ 16జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ASUS ROG Phone 7 హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానున్నట్లు తెలుస్తోంది. ASUS ROG Phone 7 తో పాటు, ASUS ROG Phone 7 Ultimate మరియు ASUS ROG Phone 7D ఫోన్లు లాంచ్ కానున్నట్లు సమాచారం.
అఫీషియల్ గా ఆసుస్ నుంచి ఇండియా లాంచ్ మరియు మోడల్స్ కి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. త్వరలోనే ఆసుస్ ఒక అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈలోపు ఆసుస్ ఆర్‌వోజీ ఫోన్ 7 కి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం పదండి.
గీక్‌బెంచ్ పై కనిపించిన ASUS ROG Phone 7
క్వాల్కమ్ యొక్క టాప్ గ్రేడ్ చిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్నట్లు సమాచారం. ఈ చిప్ 3.19గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 740 జీపీయూ వాడనున్నట్లు సమాచారం. ఇకపోతే 16జిబి ర్యామ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ASUS ROG Phone 7 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.
ASUS ROG Phone 7 డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1958 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 5238 పాయింట్లు సాధించినట్లు సమాచారం. ఇండియన్ వేరియంట్ ఏఐ2205_సీ అనే మోడల్ నంబర్ ని కలిగి ఉండగా, గ్లోబల్ వేరియంట్ ఏఐ2205_ఏ అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. గ్లోబల్ వర్షన్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇది సింగిల్ కోర్ టెస్ట్ లో 2022 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 5719 పాయింట్లు సాధించింది.
ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్ (అంచనా)
ASUS ROG Phone 7 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ తో రానుందని అంచనా వేస్తున్నారు. ఫోన్ టెంపరేచర్ ని నియంత్రణలో ఉంచేందుకు ప్రత్యేకమైన కూలింగ్ హార్డ్‌వేర్ ని ఈ డివైజ్ లో ఆసుస్ అందించే అవకాశం ఉంది. తాజాగా లీకైన సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం, చైనీస్ వేరియంట్ 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
