
గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించే ASUS సంస్థ గ్లోబల్ గా ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో ROG Phone 8, ROG Phone 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. CES 2024 సదస్సులో ఈ సిరీస్ ని ఆసుస్ పరిచయం చేసింది. ఆర్ఓజీ 8 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. సరే, ఓసారి ASUS ROG Phone 8 సిరీస్ లో వచ్చిన రెండు మోడల్స్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
ASUS ROG Phone 8, Phone 8 Pro ధరలు, కలర్ ఆప్షన్స్
- ASUS ROG Phone 8 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1099.99 డాలర్లు (సుమారు రూ.91,380) గా ఉంది.
- ASUS ROG Phone 8 Pro 16జిబి + 512జిబి వేరియంట్ ధర 1199.99 డాలర్లు (సుమారు రూ.99,685) గా ఉంది.
- ASUS ROG Phone 8 Pro 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 1499.99 (సుమారు రూ.1,24,610) గా ఉంది.
- ASUS ROG Phone 8 రెబెల్ గ్రే మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ASUS ROG Phone 8 Pro ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో మాత్రమే లభించనుంది.
ASUS ROG Phone 8, Phone 8 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1-120 హెర్ట్జ్ ఎల్టీపీవో (గేమింగ్ కోసం 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) శాంసంగ్ ఈ6 అమోలెడ్ 10-బిట్ హెచ్డీఆర్ 20:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే, 2500 నిట్స్ బ్రైట్నెస్, 107.37% డీసీఐ-పీ3/145.65% ఎస్ఆర్జీబీ / 103.16% ఎన్టీఎస్‌సీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
- ప్రాసెసర్: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లు 12జిబి/16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- కెమెరా: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 6-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి 3x టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అలాగే 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ అందించారు.
- కనెక్టివిటీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్/గ్లొనాస్/బైడూ, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: ASUS ROG Phone 8 సిరీస్ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్స్, 5-మ్యాగ్నెట్ స్టీరియో స్పీకర్, డైరాక్ వర్చువో, ఆసుస్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కల్గిన ట్రై-మైక్రోఫోన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.











