ప్రముఖ టెక్ బ్రాండ్ ASUS త్వరలో ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో ASUS ROG Phone 8, ASUS ROG Phone 8 Pro, ASUS ROG Phone 8 Ultimate అనే మోడల్స్ వస్తాయని అంచనా. లాంచ్ తేదీ రాకముందే, తన ఫ్లాగ్షిప్ సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ASUS ROG Phone 8 యొక్క ప్రాసెసర్ ప్రకటన వివరాలు, లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
ASUS ROG Phone 8 సిరీస్ ప్రాసెసర్
- ఆసుస్ కంపెనీ తన ASUS ROG Phone 8 సిరీస్ లో క్వాల్కమ్ పవర్ఫుల్ చిప్సెట్ ఉండనుందని కన్ఫర్మ్ చేసింది.
- ఆసుస్ షేర్ చేసిన పోస్టర్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ మెన్షన్ చేయబడి ఉండటం గమనించవచ్చు.
- ఇకపోతే, Snapdragon 8 Gen 3 చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 3.3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఈ ప్రాసెసర్ సొంతం.
- ఈ చిప్సెట్తో యూజర్ కి ఉత్తమమైన గేమింగ్ మరియు వేగవంతమైన పనితీరు అనుభూతి లభిస్తాయి.
ASUS ROG Phone 8 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
ASUS ROG Phone 8 సిరీస్ 2024 లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: ASUS ROG Phone 8, ASUS ROG Phone 8 Pro, ASUS ROG Phone 8 Ultimate. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ ఫోన్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన వస్తే అప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది.
ASUS ROG Phone 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: ASUS ROG Phone 8 సిరీస్ లోని అన్ని ఫోన్లలో అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అయితే వాటి యొక్క సైజ్ ఇంకా తెలియదు.
- ప్రాసెసర్: ASUS ROG Phone 8 సిరీస్ డివైజెస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: ASUS ROG Phone 8 సిరీస్ 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో రానుంది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియాలి.
- బ్యాటరీ: ASUS ROG Phone 8 సిరీస్ డివైజెస్ లో గరిష్టంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- ఓఎస్: ASUS ROG Phone 8 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.
