Home News మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్

మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్

హైలైట్స్:

Pic Credit: felidaeelectric.com

బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్: గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలోని యువతలో సైకిళ్ళ పట్ల క్రేజ్ పెరిగింది. ఎన్నో సైకిల్ తయారీ కంపెనీలు బ్యాటరీ-పవర్డ్ సైకిళ్ళను లాంచ్ చేశాయి. తక్కువ దూరాలకు ఈ సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మీరు కనుక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలనుకుంటే అందుకు సంబంధించిన సమాచారాన్ని మీకు మేం అందిస్తాం. మార్కెట్ లో ఏయే ఎలక్ట్రిక్ సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓసారి చూడండి.

బ్యాటరీ తో నడిచే సైకిళ్ళు:

1. Hero Lectro C8i

తక్కువ మరియు ఓ మోస్తరు దూరాలకు వెళ్ళి వచ్చే వారికి హీరో లెక్ట్రో సీ8ఐ ఎలక్ట్రిక్ సైకిల్ ఉత్తమమైనది. ఐస్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా, బ్లూటూత్ సాయంతో రైడర్ స్పీడ్, మ్యాప్స్, బ్యాటరీ చార్జ్, మోడ్, బ్యాటరీ డ్రెయిన్ ఇన్ఫర్మేషన్ వంటివి తెలుసుకోవచ్చు. ఈ సైకిల్ 35 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. ఈ సైకిల్ పై రూ.7500 సబ్సిడీ లభిస్తుంది. ఈ సైకిల్ లో 6.36ఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని కెపాసిటీ 250వాట్. ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.39,999.

2. Smartron tbike OneX

ఈ సైకిల్ రేంజ్ 100 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే, వంద కిలోమీటర్లు నిర్విరామంగా పరిగెడుతుంది. ఈ సైకిల్ లో రేంజ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇందులో స్వాపబుల్ బ్యాటరీ సౌకర్యం ఉంది. ఈ సైకిల్ ఫ్రేమ్ పై జీవితకాల వ్యారంటీని అందిస్తున్నారు. ఈ సైకిల్ బ్యాటరీ 5 ఏళ్ళకు పైగా నడుస్తుంది. అలాగే 1,00,000 కిలోమీటర్ల రైడింగ్ లైఫ్ ఇస్తుంది. ఈ సైకిల్ పై 125 కిలోల బరువుని తీసుకెళ్ళవచ్చు.ఇక దీని ధర జీఎస్టీ లేకుండా రూ.38,000.

3. Tresor e-cycle

ఈ సైకిల్ లో 250 వాట్ మోటర్ రిమూవబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీని అందించారు. సింగిల్ చార్జ్ పై ఈ బ్యాటరీ 60 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఈ సైకిల్ ధర రూ.55,999.

4. Stryder Contino ETB 100

భారత మార్కెట్ లో ఈ సైకిల్ ధర రూ.37,999. అలాగే ఈ సైకిల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, బ్లూ. సైకిల్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డబుల్ డిస్క్ బ్రేక్స్, కీ-లాక్ బ్యాటరీ, స్మార్ట్ రైడ్, ఫ్రంట్ ఎల్ఈడీ నైట్ విజన్ ల్యాంప్, డిటాచబుల్ బ్యాటరీ, ఐపీ54 వాటర్/స్ప్లాష్ ప్రూఫ్ బాడీ ఉన్నాయి. సింగిల్ చార్జ్ పై ఈ సైకిల్ 60 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

5. Roadlark electric cycle

ఈ సైకిల్ లో బీఎల్‌డీసీ 250వాట్ 36వోల్ట్స్ మోటర్ అమర్చారు. పెడల్-అసిస్ట్ మోడ్ లో సైకిల్ 100 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది. రోడ్ లార్క్ యొక్క టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్. 3 నుంచి 5 గంటల్లో ఈ సైకిల్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఈ సైకిల్ ధర రూ.44,083.

6. Hero F2i, Hero F3i

ఈ సైకిల్స్ సింగిల్ చార్జ్ పై 35 కిలోమీటర్లు పరిగెడతాయి. 7 గేర్ స్పీడ్ ఈ సైకిల్స్ లో అందుబాటులో ఉంది. ఈ సైకిల్స్ 100ఎంఎం సస్పెన్షన్, 27.5-ఇంచ్, 29-ఇంచ్ డబుల్ అల్లాయ్ రిమ్స్ తో వస్తున్నాయి. Hero F2i ధర రూ.39,999, Hero F3i ధర రూ.40,999.

లేటెస్ట్ ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.