హైలైట్స్:
- భారత్ లో త్వరలో ఒక అల్ట్రా ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ మోటోరాడ్
- ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గ్లోబల్ వెహికిల్ ఈ బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ-స్కూటర్
- ఈ-స్కూటర్ రేంజ్ 130 కిలో మీటర్లు, టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్ వేగం అందుకోనున్న సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్
బవేరియన్ ఆటోమోటివ్ జెయింట్, బీఎండబ్ల్యూ యొక్క మోటర్ సైక్లింగ్ డివిజన్, త్వరలో ఒక కొత్త ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్, బీఎండబ్ల్యూ సీఈ 04 ని భారత్ లో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈమధ్యే, బీఎండబ్ల్యూ మోటోరాడ్ భారత విభాగం, బీఎండబ్ల్యూ సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ ను భారత్ లో లాంచ్ చేసింది. రూ.10 లక్షలకు పైగా ధర ఉన్నప్పటికీ, ఆ స్కూటర్ సక్సెస్ కావడం విశేషం. దీంతో కంపెనీ, బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ-స్కూటర్ ను భారత్ లో లాంచ్ చేయాలని నిర్ణయించింది.
యూనిక్ కాన్సెప్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ సీఈ 04 ను ధనిక ఔత్సాహికులను టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీయూ రూట్ ద్వారా బీఎండబ్ల్యూ సీఈ 04 ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లోకి తీసుకురావాలని బీఎండబ్ల్యూ ప్లాన్ చేస్తోంది.
భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్
బీఎండబ్ల్యూ సీఈ 400 జీటీ భారత్ లో బాగా అమ్ముడవుతుండటంతో, బీఎండబ్ల్యూ ఉన్నతాధికారులు, బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ భారత మార్కెట్ లో అల్ట్రా-ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ మ్యాజిక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. సీబీయూ ఇంపోర్ట్ అయిన బీఎండబ్ల్యూ సీఈ 04 ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండనుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో బేస్ మోడల్ ధర రూ.9.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
కాన్సెప్ట్ మోడల్ మాదిరి ఉన్న బీఎండబ్ల్యూ సీఈ 04 అల్ట్రా-ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తన డిజైన్ తో బయ్యర్లను రాబట్టనుందని అంచనా వేస్తున్నారు. 2008 లో క్రిస్టోఫర్ నొలన్ తీసిన ద డార్క్ నైట్ సినిమాలో బ్యాట్ మ్యాన్ నడిపిన బ్యాట్ సైకిల్ లాగా ఈ స్కూటర్ డిజైన్ ఉండటం విశేషం. ట్యూబ్యులర్ సెంటర్ ఫ్రేమ్ చే స్కూటర్ యొక్క వీల్స్ చివరలకు నెట్టబడ్డాయి. ఇక రియర్ వీల్, స్కూటర్ మిగతా బాడీకి దూరంగా ఉండటం డ్రమాటిక్ లుక్ ని ఇచ్చింది. ఇక సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, మోనో షాక్ లతో స్కూటర్ లుక్ వెరైటీగా కనిపిస్తోంది. ఇక సీటు పై ఆరెంజ్ కలర్ లో హైలైట్స్ ఉండటం గమనించవచ్చు. బాడీ గ్రాఫిక్స్, స్క్వేర్ షేపులో ఉన్న విండ్ షీల్డ్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈ స్కూటర్ 20 హెచ్పీ లిక్విడ్ కూల్డ్ పీఎంఎస్ఎం తో కూడిన 8.9kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. ఇది 130 కిలోమీటర్ల రేంజ్ ను సింగిల్ ఛార్జ్ తో చేరుకోగలదు. 2.6 సెకన్లలో ఈ వెహికిల్ 120 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. ఇక బండి ముందు డ్యూయల్ డిస్క్స్, వెనుకవైపు సింగిల్ డిస్క్ మరియు ఏబీఎస్ ఉన్నాయి. ఇక సీట్ హైట్ 780ఎంఎం కాగా, బండి బరువు 231 కిలోగ్రాములు.
బీఎండబ్ల్యూ బ్రాండ్ నుంచి వస్తోన్న బండి కనుక, ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎన్నో ఆప్షనల్ యాడ్-ఆన్స్, యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, బీఎండబ్ల్యూ వాటిని భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుందో లేదో చూడాలి. భారత్ లో బీఎండబ్ల్యూ మోటరాడ్ కుటుంబం మరింత ఎదగాలని ఆశిస్తోంది. అందుకోసమే బీఎండబ్ల్యూ సీ 400 జీటీ మ్యాక్సీ, బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి బండ్లను రంగంలోకి దింపుతోంది.