Home News BSNL 4G: ఒక లక్ష సైట్స్ లో ప్రారంభం కానున్న 4G నెట్వర్క్, మంజూరైన రూ.24,500 కోట్ల విలువగల సామగ్రి

BSNL 4G: ఒక లక్ష సైట్స్ లో ప్రారంభం కానున్న 4G నెట్వర్క్, మంజూరైన రూ.24,500 కోట్ల విలువగల సామగ్రి

Highlights
  • లక్ష సైట్స్ లో ప్రారంభం కానున్న BSNL 4జీ నెట్వర్క్
  • TCS తో కలిసి 4జీ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తోన్న BSNL
  • పూర్తిగా భారత్ లో రూపుదిద్దుకోనున్న BSNL 4జీ వ్యవస్థ

భారత్ లో BSNL 4G కోసం ఎదురు చూస్తోన్న వారికి శుభవార్త. త్వరలోనే భారత్ లోని ఒక లక్ష సైట్స్ లో 4G నెట్వర్క్ ని ప్రారంభించేందుకు BSNL సంస్థకి అనుమతులు వచ్చాయి. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.24,500 కోట్ల విలువైన 4జీ ఎక్విప్మెంట్ ని ప్రభుత్వ టెలీకామ్ సంస్థ BSNL కి సమకూర్చనుంది. పూర్తిగా భారతీయ నైపుణ్యంతో BSNL 4G రూపొందుతుండటం గొప్ప విషయం.

1 లక్ష సైట్లలో ప్రారంభం కానున్న BSNL 4G నెట్వర్క్

లక్ష సైట్లలో 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసే విధంగా BSNL కి మరియు టీసీఎస్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ బోర్డు ఈ డీల్ కి అనుమతులు జారీ చేసింది. దీంతో టీసీఎస్ సంస్థ రూ.24,556.37 కోట్ల విలువజేసే ఎక్విప్మెంట్ ని BSNL కి అందజేసేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

డీల్ లో భాగంగా TCS సంస్థ BSNL సంస్థ కి తన టెక్నాలజీని మరియు పరికరాలను అందించనుంది. ఈ ఒప్పందం నిరవధికంగా 10 ఏళ్ళ పాటు కొనసాగుతుంది. ఇన్నేళ్ళపాటు టీసీఎస్ తన సేవలను BSNL కి అందించనుంది. డీల్ ప్రకారం, నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఖర్చు రూ.13,000 కోట్లు అవుతుందని అంచనా. టీసీఎస్ తో పాటు తేజస్ నెట్వర్క్స్ కూడా BSNL కోసం 4జీ నెట్వర్క్ ని తయారు చేయనుంది.

BSNL 4G లాంచ్ ఎందుకు జాప్యమవుతోంది?

BSNL బోర్డు నుంచి సమ్మతి వచ్చినప్పటికీ, BSNL 4G నెట్వర్క్ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుంది. బోర్డు నిర్ణయం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ కి చేరాలి. డీఓటీ కూడా తన తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. టెలీకమ్యూనికేషన్ విభాగం డ్రాఫ్ట్ రూపొందించాక, దానిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి పంపనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.