హైలైట్స్
- BSNL కస్టమర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర టెలీకామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్
- 1.35 లక్షల టవర్లలో మొదలుకానున్న BSNL 5జీ సేవలు
- రానున్న 5 నుంచి 7 నెలల్లో లాంచ్ కానున్న BSNL 5G నెట్వర్క్
భారత్ లో ఇప్పటికే ఎయిర్టెల్, జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. పలు ప్రధాన నగరాలు, కొన్ని ఎంపికచేయబడ్డ ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు BSNL కూడా వీటికి పోటీగా దూసుకొస్తోంది. రానున్న 5 నుంచి 7 నెలల కాలంలో BSNL 5జీ సేవలు మొదలవుతాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 1.35 లక్షల 4జీ టవర్లు 5జీకి మారనున్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. 4జీ నెట్వర్క్ ని ఏర్పరచడంలో BSNL కంపెనీ విఫలమవ్వడంతో, ప్రభుత్వం రంగంలోకి దిగింది. త్వరలోనే 4జీ, 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
5G కి మారనున్న BSNL 4G టవర్స్
మీడియా కథనాల ప్రకారం, BSNL తనకు చెందిన 1.35 లక్షల 4జీ టవర్లను 5జీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమ్యాటిక్స్ BSNL కి 5జీ కోర్ ని ప్రొవైడ్ చేయనుంది. అలాగే ఈ కంపెనీ 5జీ సేవలను ఎనేబుల్ చేసేందుకు అవకాశం ఉంది.
2023 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న 5జీ సేవలు
రానున్న 6 నెలల్లో BSNL 5జీ సేవలు 200 కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే కొన్నేళ్ళలో దేశంలో 80 నుంచి 90 శాతం మేర 5జీ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే BSNL 5జీ వచ్చే ఏడాది ఆగస్టు 15 న లాంచ్ అవుతుందని ఆయన అన్నారు.
BSNL మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కలిసి 4జీ సేవలు అందిస్తాయని గతంలో వార్తలు వచ్చాయి. 4జీ సేవల కోసం భారతీయ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి. అదే విధంగా BSNL డైరెక్టర్ సుశీల్ కుమార్ మిశ్రా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం, టెలీకామ్ సెక్టర్ లో 100 శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కి ఆమోదం తెలిపింది. అలాగే టెలీకామ్ కంపెనీలకు స్పెక్ట్రమ్ చార్జెస్ మరియు ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై 4 ఏళ్ళ మారటోరియమ్ ని కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా ఇంకా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు దేశమంతటా అందుబాటులోకి రాలేదు. మరి ఈలోపు 5జీకి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి. అంటే రానున్న 7 నెలల్లో 4జీ మరియు 5జీ సేవలు లాంచ్ కానున్నాయన్నమాట. అయితే ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, టీసీఎస్ తో కలిసి దేశంలో పలు చోట్ల 4జీ ట్రయల్స్ నిర్వహించింది. మరి పూర్తిస్థాయిలో బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో తెలియదు. అయితే జరుగుతోన్న పరిణామాలను బట్టి చూస్తే అతి త్వరలో BSNL 4జీ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.