Home News మరొక వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్ తో వచ్చిన BSNL

మరొక వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్ తో వచ్చిన BSNL

హైలైట్స్

ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL తాజాగా రూ.269 రీచార్జ్ ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ట్విట్టర్ ద్వారా ఈ ప్లాన్ ని BSNL ప్రకటించింది. ఈ ప్లాన్ తో BSNL జియోకి గట్టి పోటి ఇవ్వనుంది. ఉత్తమమైన ప్రయోజనాలు రూ.300 లోపు ధరలో లభిస్తుండటం విశేషం. ఈ ప్లాన్ ధర కేవలం రూ.269 మాత్రమే. BSNL తీసుకొచ్చిన ఈ చీపెస్ట్ ప్లాన్ కి సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

30 రోజుల వ్యాలిడిటీ

BSNL కంపెనీ రూ.269 ధరతో సరికొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ రీచార్జ్ ప్లాన్ ధర రూ.300 లోపు లభిస్తుండటం విశేషం. ఈ రూ.269 రీచార్జ్ ప్లాన్ తో 28 రోజులకు బదులుగా 30 రోజుల వ్యాలిడిటీ యూజర్లకు లభిస్తుంది. ప్లాన్ కి సంబంధించిన వివరాలను BSNL తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. మరి ఈ ప్లాన్ లో ఇంకా ఏయే ప్రయోజనాలు లభించనున్నాయో తెలుసుకుందాం రండి.

OTT మరియు Gaming ప్రయోజనాలు

ఈ ప్లాన్ ద్వారా Eros Now Entertainment ఓటీటీ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. Lystn Podcast సర్వీస్, Hardy Mobile Game సర్వీస్, Lokhdhun, Zing సేవలు ఉచితంగా లభించనున్నాయి. అలాగే గేమ్స్ ఆడేవారు రూ.2 లక్షల రివార్డుని గెలుచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు యూజర్లు 30 రోజుల పాటు ఫ్రీ ట్యూన్ ఫెసిలిటీని పొందనున్నారు. ఎన్నిసార్లైనా ట్యూన్ ని మార్చుకునే అవకాశం ఉంది.

60GB డేటా మరియు ఉచిత కాలింగ్

BSNL రూ.269 ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. అలాగే ఈ వ్యాలిడిటీ సమయంలో కస్టమర్లు ప్రతి రోజు 2జిబి డేటా పొందుతారు. మొత్తంగా 60జిబి డేటా కస్టమర్లకు లభించనుంది. ఇదే కాకుండా, యూజర్లు 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు పొందుతారు. అలాగే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

త్వరలో లాంచ్ కానున్న BSNL 5G

దేశంలో ప్రధాన టెలీకామ్ ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో తమ 5జీ సేవలను లాంచ్ చేశాయి. ఎంపిక చేయబడిన పలు నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా త్వరలోనే 5జీ సేవలను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో టెలీbకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆగస్టు 15 కల్లా BSNL 5G సేవలు లాంచ్ అవుతాయని చెప్పారు. దీంతో 5జీ సేవలు ఎప్పుడు లాంచ్ అవుతాయా అని ఎదురు చూస్తున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఓ క్లారిటీ వచ్చినట్లైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.