హైలైట్స్
- కొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL
- కొత్తగా లాంచ్ అయిన BSNL రీచార్జ్ ప్లాన్ ధర రూ.599
- 84 రోజుల వ్యాలిడిటీ, 5జిబి డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ ఈ ప్యాక్ ప్రయోజనాలు
దేశంలో ఇటీవలె 5జీ సేవలు లాంచ్ అయ్యాయి. ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. అయితే తొలిదశలో ఈ సేవలు కేవలం కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి. అన్ని ప్రాంతాలకు 5జీ కనెక్టివిటీని విస్తరింపజేసేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి.
ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNL ఇంకా 4జీ సేవలను కూడా లాంచ్ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం BSNL కి ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా 4జీ లైసెన్స్ ని BSNL పొందింది. దీంతో అతి త్వరలో BSNL 4జీ నెట్వర్క్ ని లాంచ్ చేయబోతోంది. ఇకపోతే ఆ వెనువెంటనే 5జీ సేవలను కూడా అందించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం BSNL వరుసబెట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్ ని అందిస్తోంది. లేటెస్ట్ గా లాంచ్ అయిన ఓ ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.
ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL తాజాగా ఓ రీచార్జ్ ప్లాన్ ని తన వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త రీచార్జ్ ప్లాన్ ధర రూ.599. ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 5జిబి డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 420జిబి డేటా పొందవచ్చు. 5జిబి డేటా పరిధి ముగిసాక ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్ కి పడిపోతుంది. ఇక ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
ప్రతిరోజూ 5జిబి డేటా
BSNL తీసుకొచ్చిన రూ.599 ప్లాన్ తో ప్రతిరోజు 5జిబి డేటాను పొందవచ్చు. అంటే మొత్తంగా 420జిబి డేటాను వినియోగదారులు పొందుతారు. రూ.599 ధరలో ఎక్కువ రోజువారీ డేటాను అందించే ఈ ప్లాన్ వినియోగదారులను ఇట్టే ఆకర్షించేలా ఉంది. ప్రతిరోజు 5జిబి డేటా అంటే ఇంటర్నెట్ ని అధికంగా వాడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
84 రోజుల వ్యాలిడిటీ
తాజాగా BSNL రూ.599 రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. అలాగే ప్రతిరోజూ 5జిబి డేటా కూడా లభిస్తుంది. టెలీకామ్ మార్కెట్ లో ఉన్న 84 రోజుల రీచార్జ్ ప్లాన్స్ లో అత్యంత చవకైన, వాల్యూ ఫర్ మనీ ప్లాన్ ఇదేనని చెప్పవచ్చు.
5 గంటల పాటు ఉచిత డేటా
BSNL తీసుకొచ్చిన రూ.599 ప్లాన్ ద్వారా మరొక గొప్ప ప్రయోజనం వినియోగదారునికి లభించనుంది. అదే ఫ్రీ డేటా ఫీచర్. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 5జిబి డేటా లభిస్తుంది. అయితే డెయిలీ 5జిబి డేటా కాకుండా, BSNL కంపెనీ అదనంగా 5 గంటల డేటాను ప్రతిరోజూ అందించనుంది. అయితే ఈ ఉచిత డేటాను రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే వాడుకునే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.