ప్రైవేటు టెలీకామ్ కంపెనీలతో పోటీపడటంలో భాగంగా BSNL తన ప్లాన్స్ కి పలు మార్పులు చేస్తోంది. BSNL సంస్థ తన వెబ్‌సైట్ నుంచి స్పెషల్ టారిఫ్ వోచర్లను తొలగించింది. కంపెనీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ వెబ్ సైట్ నుంచి మాత్రం వీటిని తొలగించింది. రూ.71, రూ.104, రూ.135, రూ.395 ప్యాక్స్ ప్రస్తుతం BSNL వెబ్ సైట్ లో అందుబాటులో లేవు. పెద్దగా పాపులర్ కాని ఈ ప్యాక్స్ వల్లన కంపెనీకి కూడా ప్రయోజనం లేకపోవడంతో వీటిని తొలగించినట్లు అర్థమవుతోంది.
BSNL తొలగించిన స్పెషల్ ట్యారిఫ్ వోచర్స్ జాబితా
BSNL స్పెషల్ ట్యారిఫ్ వోచర్ రూ.71
BSNL రూ.71 ప్యాక్ రీచార్జ్ చేసుకునే వారికి నిమిషానికి కాల్ చార్జ్ 30 పైసలు అవుతుంది. దీని ద్వారా ఉచిత కాలింగ్, మెసేజెస్ వంటి ప్రయోజనాలు లభించవు. 30 రోజులకు గాను కస్టమర్ కి రూ.20 ల యూసేజ్ వాల్యూ పొందుతారు. అయితే, ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఎటువంటి డేటా ప్రయోజనాలు లభించవు.
BSNL స్పెషల్ ట్యారిఫ్ వోచర్ రూ.104
BSNL అందించే రూ.104 స్పెషల్ ట్యారిఫ్ వోచర్ ద్వారా 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 3జిబి డేటా, 30 ఎస్ఎంఎస్ తో పాటు 300 నిమిషాలు టాక్‌టైమ్ లభిస్తుంది. వీటితో పాటు ఒక డిస్కౌంట్ కూపన్ కూడా లభించనుంది. ప్రస్తుతం ఈ ప్యాన్ ని BSNL తొలగించింది.
BSNL స్పెషల్ ట్యారిఫ్ వోచర్ రూ.135
BSNL రూ.135 ప్యాక్ ద్వారా 1440 నిమిషాల టాక్ టైమ్ లభిస్తుంది. అయితే, కస్టమర్లకు ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనాలు ఏమీ లభించవు. ఈ ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ అందించేది. ప్రస్తుతం ఈ ప్యాక్ ని BSNL నిలిపివేసింది.
BSNL స్పెషల్ ట్యారిఫ్ వోచర్ రూ.395
BSNL స్పెషల్ ట్యారిఫ్ వోచర్ రూ.395 ద్వారా 3000 నిమిషాలు ఆన్-నెట్ కాలింగ్, 1800 నిమిషాలు ఆఫ్-నెట్ కాలింగ్ ప్రయోజనాలు లభించేవి. అయితే ఈ ప్రయోజనాలను పొందేందుకు కస్టమర్ నిమిషానికి 20 పైసలు వెచ్చించాల్సి వచ్చేది. ఈ ప్లాన్ ద్వారా 2జిబి డెయిలీ డేటా 71 రోజుల పాటు లభించేది. అయితే డేటా పరిధి దాటాక స్పీడ్ 80కేబీపీఎస్ కి పడిపోయేది. ప్రస్తుతం ఈ ప్లాన్ ని కూడా BSNL నిలిపివేసింది.
BSNL సంస్థ ఈ ఏడాది 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా కంపెనీ పని చేస్తోంది. 4జీ నెట్వర్క్ లాంచ్ కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ TCS తో కలిసి పని చేస్తోంది. టీసీఎస్ సంస్థ బీఎస్ఎన్ఎల్ కి కావాల్సిన 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ని అందిస్తోంది. త్వరలోనే BSNL నుంచి 4G లాంచ్ కి సంబంధించిన ప్రకటన రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
