Home News BSNL రూ.186 ప్లాన్: Hardy Games సర్వీస్ తో పాటు మరెన్నో బెనిఫిట్స్

BSNL రూ.186 ప్లాన్: Hardy Games సర్వీస్ తో పాటు మరెన్నో బెనిఫిట్స్

Highlights
  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ అందిస్తోన్న BNSL కంపెనీ
  • రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేటా, కాలింగ్, వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్
  • రూ.186 ప్లాన్ తో లభించనున్న హార్డీ గేమ్స్ సర్వీస్ మరియు ఉచిత బీఎస్ఎన్ఎల్ ప్రయోజనాలు

భారతదేశంలో ఉన్న ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్ వద్ద ఉన్నాయి. దీంతో టాప్ టెలీకామ్ సంస్థలైన ఎయిర్టెల్, జియో లకు కూడా బీఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తోంది. అయితే కొన్నాళ్ళుగా బీఎస్ఎన్ఎల్ వెనకబడే ఉంది. తన పోటీదారులైన ఎయిర్టెల్, జియో లు ఇప్పటికే 5జీ సేవలను లాంచ్ చేయగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జీ నెట్వర్క్ ని కూడా దేశ వ్యాప్తంగా విస్తరించలేదు.

BSNL అందిస్తోన్న 4జీ నెట్వర్క్ దేశం లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ లేదు. ఇంకా 3జీ నెట్వర్క్ పైనే బీఎస్ఎన్ఎల్ పని చేస్తోంది. అయితే అతి త్వరలో 4జీని దేశ వ్యాప్తం చేయనున్న బీఎస్ఎన్ఎల్, 5జీ ని కూడా వచ్చే ఏడాది కల్లా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం BSNL సంస్థ, TCS తో జట్టుకట్టింది.

సరే, ఇప్పుడు మనం బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మరి రూ.186 ప్లాన్ అందించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

BSNL రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL అందిస్తోన్న రూ.186 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్స్ కి అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. దీని ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిసాక, ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

BSNL రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

BSNL అందిస్తోన్న రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి డేటా, వ్యాలిడిటీ, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. కస్టమర్ కి హార్డీ గేమ్స్ సర్వీస్ మరియు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడనుంది. హార్డీ గేమ్స్ సర్వీస్ కి యాక్సెస్ అయ్యి గేమ్స్ ఆడే అవకాశం యూజర్ కి లభిస్తుంది.

BSNL రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు, అదనపు బెనిఫిట్స్ వివరాలు తెలుసుకున్నారు కదా? ఇప్పుడు ప్లాన్ వివరాలను మరొకసారి చదివి, మీకు సరిపడేదైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.