Home News BSNL రూ.397 ప్లాన్: 180 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్

BSNL రూ.397 ప్లాన్: 180 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్

Highlights
  • రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, డేటా మరియు మరెన్నో ప్రయోజనాలు
  • 180 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డెయిలీ 2జిబి డేటా, 100 ఎస్ఎంఎస్
  • ఉచిత ప్రయోజనాలు కేవలం 60 రోజులకు మాత్రమే పరిమితం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో BSNL తీరు ప్రత్యేకం. చవక ధరల్లో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ఎన్నో ఈ సంస్థ వద్ద ఉన్నాయి. తమ యూజర్లకు కావాల్సిన ప్లాన్స్ ని ఎప్పటికప్పుడు సంసిద్ధం చేస్తుంటుంది బీఎస్ఎన్ఎల్. యూజర్లు కూడా BSNL అందిందే చవకైన ప్లాన్స్ కి బాగా అలవాటు పడిపోయారు. ప్రయివేటు టెలీకామ్ సంస్థలు అందిస్తోన్న ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ తో పోల్చితే BSNL ప్లాన్స్ ధరలు తక్కువగా ఉండటంతో BSNL వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు.

ఈ ఆర్టికల్ లో మనం BSNL అందిస్తోన్న రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత కాలింగ్, వ్యాలిడిటీ, డెయిలీ ఎస్ఎంఎస్, డేటా మరియు ఇతర ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. సరే, ఓసారి రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

BSNL రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL అందిస్తోన్న రూ.397 ప్రీప్రెయిడ్ ప్లాన్ ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ ద్వారా లభించే ఉచిత ప్రయోజనాలు మొదటి 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. వ్యాలిడిటీ మాత్రం 180 రోజులు లభిస్తుంది.

BSNL రూ.397 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

BSNL రూ.397 ప్లాన్ ద్వారా డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, కాలింగ్ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా యూజర్ కి లభిస్తాయి. రూ.397 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్ కి లోక్‌దన్ కంటెంట్ 60 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఇంకా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ సేవలు 60 రోజుల పాటు ఉచితంగా లభిస్తాయి.

Note: ఉచిత సేవలన్నీ ముగిసాక వాయిస్ కాల్ చార్జీలు లోకల్ అయితే నిమిషానికి రూ.1, ఎస్టీడీ కాల్స్ నిమిషానికి రూ.1.30 పైసలు, వీడియో కాల్స్ నిమిషానికి లోకల్/ఎస్టీడీ రూ.2, ఎస్ఎంఎస్ లోకల్ 80పైసలు, నేషనల్ రూ.1.20 పైసలు, అంతర్జాతీయ ఎస్ఎంఎస్ రూ.5, డేటా చార్జీలు 25 పైసలు/1ఎంబి గా ఉంటాయి.

బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు, ఇతర బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా? మరొక్కసారి పూర్తి వివరాలను చదివి, మీకు సరిపడినదైతే రీచార్జ్ చేసుకొని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి. మరింత సమాచారం కోసం BSNL వెబ్‌సైట్ విజిట్ చేసి మీ సర్కిల్ ఎంపిక చేసుకుని ప్లాన్స్ ని చెక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.