తన రీచార్జ్ ప్లాన్ తో బడా కంపెనీలకు షాకిస్తోన్న BSNL

హైలైట్స్:

  • రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐ లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్
  • డెయిలీ 5జిబి డేటా ఇచ్చే రూ.599 ప్లాన్ తో అదరగొడుతోన్న ప్రభుత్వ రంగ సంస్థ
  • త్వరలోనే 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్

టెలీకామ్ రంగంలో ఏళ్ళుగా సేవలందిస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కారణాలేవైతేనేమీ, మిగత ప్రయివేటు కంపెనీలతో పోల్చితే వెనకంజలో ఉన్న మాట వాస్తవం. బీఎస్ఎన్ఎల్ కంపెనీ ఇంకా 4జీ, 5జీ నెట్వర్క్ లను ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే 4జీ సేవలను మొదలు పెట్టాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తన పరిస్థితి ఎలా ఉంటేనేమీ, ఒక్క ప్లాన్ తో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. అవును, రూ.599 ప్లాన్ తో 5జిబి డెయిలీ డేటా అందిస్తూ తనకు తిరుగు లేదని నిరూపించింది. మరోవైపు ఇదే ధరలో మిగతా కంపెనీలు గరిష్టంగా 3జిబి డేటాను మాత్రమే ప్రతిరోజు అందిస్తున్నాయి.

డెయిలీ 5జిబి డేటా అందిస్తూ, BSNL సంస్థ, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐ లకు గట్టి సమాధానం ఇచ్చింది. మరే ఇతర ప్రైవేటు కంపెనీ కూడా ఈ రేంజ్ లో డెయిలీ డేటాను ఇవ్వడం లేదు. కేవలం డేటా మాత్రమే కాదు, 84 రోజుల వ్యాలిడిటీని కూడా BSNL అందిస్తోంది. కేవలం రూ.599 కి ఈ ప్లాన్ ని అందిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయమని చెప్పాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

BSNL రూ.599 ప్లాన్ వివరాలు

  • ప్రతిరోజు 5జిబి డేటా
  • 84 రోజుల వ్యాలిడిటీ
  • అపరిమిత కాలింగ్
  • ఉచిత డేటా
  • ప్రతిరోజు 5GB డేటా

BSNL యొక్క రూ.599 ప్లాన్ లో బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటంటే, అది ఇంటర్నెట్ డేటా. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసిన యూజర్లు ప్రతిరోజు 5జిబి డేటా పొందుతారు. 5జిబి డేటా వినియోగం తర్వాత కూడా డేటా యూసేజ్ ఉచితమే. కానీ, స్పీడ్ 80కేబీపీఎస్ కి పడిపోతుంది. ఇక్కడితోనే అయిపోలేదండి, ఇంకా ఉంది. మీరు కనుక రాత్రిళ్ళు మేలుకుని ఉండేందుకు ఇష్టపడితే, ఈ ప్లాన్ మీకు సూపర్ ట్రీట్ అని చెప్పవచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఇది మీ డెయిలీ డేటా లిమిట్ కి ఏ మాత్రం వర్తించదు. ఇంకేముంది నైట్ అంతా ఫుల్ ఫ్రీ డేటాను ఎంజాయ్ చేయండి.

రూ.599 ప్లాన్ తో ఇంకా జింగ్ యాప్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ తో ఏ మేజర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్ రాదు. ప్రస్తుత తరుణంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ రూ.599 ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది. త్వరలోనే BSNL తన 4జీ సేవలను దేశ వ్యాప్తం చేయడంతో పాటు, 5జీ ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రెండు నెట్వర్క్స్ సెటప్ కోసం BSNL, TATA కంపెనీతో చేతులు కలిపింది.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleSnapdragon 8+ Gen 1 చిప్, 200MP కెమెరాతో రానున్న Xiaomi 12T Pro
Next articleరివీల్ అయిన OnePlus 11 Pro స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.