BSNL 4G లాంచ్: 2024 కల్లా దేశ వ్యాప్తంగా విస్తరించనున్న సేవలు

హైలైట్స్:

  • 2024 కల్లా దేశ వ్యాప్తంగా ప్రారంభం కానున్న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
  • 4జీ మరియు 5జీ నెట్వర్క్స్ ను అందించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో కలిసి పని చేయనున్న బీఎస్ఎన్ఎల్
  • ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ 4జీ ట్రయల్స్ లో 20ఎంబీపీఎస్ స్పీడుని అందుకున్నట్లు సమాచారం

భారతీయ టెలీకామ్ నెట్వర్క్స్ వచ్చే వారం 5జీ స్పెక్ట్రమ్ మెగా వేలం లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ సేవలు భారత్ లో ప్రారంభమవుతాయని అందరూ భావిస్తున్నారు. కనీసం కొన్ని ప్రధాన నగరాల్లోనైనా సేవలు మొదలవ్వడం ఖాయం. దేశ వ్యాప్తంగా ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) 5జీ ట్రయల్స్ తో బిజీ అయిపోయాయి. అయితే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను దేశంలో మొదలుపెట్టకపోవడం బాధాకరం. ప్రభుత్వం నుంచి మద్ధతుని పొందిన బీఎస్ఎన్ఎల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో కలిసి 4జీ, 5జీ సేవలను అందించాలని, ఆ దిశగా అడుగులు వేస్తోంది.

BSNL 4G సేవలు

24 నెలల కాల వ్యవధిలో 4జీ సేవలను దేశ వ్యాప్తం చేయాలని బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలు వేసుకున్నట్లు తాజాగా ఓ వార్త ద్వారా తెలుస్తోంది. ఓవైపు 5జీ సేవలు మొదలవ్వనున్న ఈ తరుణంలో ఇంకా 4జీ కొరకు ఇంకా రెండేళ్ళ టైమ్ తీసుకోవాలనుకోవడం శోచనీయం. ఏదేమైనా 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు మరో రెండేళ్ళు వేచి చూడక తప్పేలా లేదు. అయితే మిగతా టెలీకామ్ నెట్వర్క్స్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ యొక్క ప్లాన్స్ ధరలు తక్కువగా ఉండటం ప్లస్ పాయింట్.

BSNL 5G సేవలు

ఈమధ్యే ఎకనమిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇప్పటికే 4జీ ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ డెమానిస్ట్రేషన్ ను పూర్తి చేసినట్లు సమాచారం. ఇక నెట్వర్క్ ప్లానింగ్, టెక్నికల్, కమర్షియల్ యాస్పెక్ట్స్ విషయమై భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి టీసీఎస్ పని చేయడమే తరువాయి.

ఇప్పటికే పలు అభివృద్ధి పరమైన, కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ విషయమై బీఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ముగిసే నాటికి, మొదటి బ్యాచ్ ఎక్విప్మెంట్ ను సిద్ధం చేయాలని టీసీఎస్ భావిస్తోందట. ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షలు, ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ మరియు సిస్టమ్స్ తో ఇంటిగ్రేషన్ వంటి పనులు పూర్తయినట్లు వినికిడి. అలాగే ఆ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినట్లు తెలుస్తోంది.

రానున్న 18 నుంచి 24 నెలల కాలంలో టీసీఎస్ మరియు బీఎస్ఎన్ఎల్ కలిసి 4జీ రోలౌట్ ను పూర్తి చేయాలని నిర్ణయించాయట. ఇక 5జీ సేవలను గురించి మాట్లాడితే, ప్రస్తుతం 5జీ పై పనులు సాగుతున్నాయని, 5జీ ఎన్ఎస్ఏ కోర్ మరియు రేడియోస్ ని సంభావ్యత కలిగిన బ్యాండ్స్ పై చివరి పరీక్షలకు సిద్ధం చేసినట్లు ఒక ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే కేటాయించిన 12,400 సైట్స్ కి అదనంగా మరో పది లక్షల సైట్స్ కొరకు ఎక్విప్మెంట్ ని ఆర్డర్ చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ని ప్రభుత్వం ఆదేశించినట్లు పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే 4జీ ట్రయల్ లో బీఎస్ఎన్ఎల్ 20ఎంబీపీఎస్ వేగాన్ని అందుకుంది. మరి 4జీ సేవల లాంచ్ తర్వాత వేగంలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.

మీకోసం తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం 91మొబైల్స్ తెలుగు ని విజిట్ చేయండి.

Previous articleలీకైన Redmi K60 సిరీస్ ఫీచర్లు
Next articleత్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.