Home News భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు BYD Atto 3; ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్

భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు BYD Atto 3; ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్

హైలైట్స్

BYD కంపెనీ BYD Atto 3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని భారత్ లో లాంచ్ చేసింది. రూ.50,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే BYD కంపెనీ ఇంకా ఈ కారు ధరని వెల్లడించలేదు. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు Tata Nexon EV Max, MG ZS EV, Hyundai Kona EV లతో పోటీ పడనుంది. BYD Atto 3 కారు యొక్క మొదటి 500 యూనిట్లను 2023 జనవరి కల్లా డెలివరీ చేయాలని BYD లక్ష్యంగా పెట్టుకుంది.

BYD Atto 3 సింగిల్ చార్జ్ పై 521 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇక ఈ కారులో 60.48 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అలాగే 80 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు ఈ బ్యాటరీ 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతానికి చేరుకుంటుంది.

భారత్ లో లాంచ్ అయిన BYD Atto 3 కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీ

BYD Atto 3 భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ కారు కంటెంపరరీ లుక్ ని కలిగి ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ పరంగా ఈ కారు చెప్పుకోదగిన నిలకడైన రేంజ్, పెర్ఫామెన్స్ ని కలిగి ఉంటుందని సమాచారం. రూ.25 లక్షల ప్రైస్ రేంజ్ లో BYD Atto 3 మంచి ఆప్షన్ గా నిలవనుంది.

BYD Atto 3 కొహెసివ్ స్టైలింగ్ ని కలిగి ఉంది. ఈ కారు 2,720ఎంఎం వీల్‌బేస్, 4445ఎంఎం పొడవు ఉంటుంది. ఇది కోనా ఈవీ, జెడ్ఎస్ ఈవీ కంటే పొడవుగా ఉంటుంది. BYD Atto 3 లో 440 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ లుక్ అసలైన ఈవీ ఫ్యాషన్ లో కనిపిస్తోంది. అంటే గ్రిల్ లేకుండా, ఎల్ఈడీ లైటింగ్ తో కనిపిస్తుంది. ఇక కారు రియర్ పార్ట్ చూస్తే, ఎల్ఈడీ లైట్ బార్, టెయిల్ లైట్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ కారులో 18-ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ పై సిల్వర్ హైలైట్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్ బోర్డ్ స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ఫంకీ లుకింగ్ ఏసీ వెంట్, డోర్ స్పీకర్/హ్యాండిల్ డిజైన్ బాగున్నాయి. పూర్తిస్థాయి ఎల్ఈడీ లైటింగ్, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 5-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సింథటిక్ లెదర్ అప్‌హోల్‌స్ట్రీ, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసెంజర్ సీట్స్, మల్టీ కలర్ ఆంబియంట్ లైటింగ్ ఈ కారులో ఉన్నాయి. 12.8-ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే హైలైట్ గా నిలుస్తోంది. ఈ డిస్ప్లే ఆటోమేటిక్ గా పొట్రెయిట్ మరియు ల్యాండ్ స్కేప్ మోడ్ లోకి తిరుగుతుంది.

BYD Atto 3 సేఫ్టీ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే, ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కోసం ఏడీఏఎస్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కొలిజన్ వార్నింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి.

BYD కంపెనీ 3 ఏళ్ళ పాటు 4జీ డేటా కనెక్షన్, 6 ఏళ్ళ పాటు ఆర్ఎస్ఏ, 6 ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ప్రమోషనల్ ప్యాకేజీ ద్వారా అందిస్తోంది. BYD Atto 3 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. ఇక బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. త్వరలోనే డిల్లీ, ముంబై, దక్షిణాది నగరాల్లో ఏర్పాటు అయ్యే డీలర్షిప్స్ ద్వారా ఈ కారు అందుబాటులోకి వస్తుంది.