హైలైట్స్
- గత నెలలో భారత్ లో లాంచ్ అయిన BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు
- తాజాగా ధరను రివీల్ చేసిన కంపెనీ, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.33.99 లక్షలు
- హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ లతో పోటీపడనున్న BYD Atto 3
BYD సంస్థ తన కొత్త బ్యాటరీ కారుని భారతీయ మార్కెట్ లో గత నెలలో లాంచ్ చేసింది. BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను తాజాగా కంపెనీ రివీల్ చేసింది. అక్టోబర్ 11 నుంచి రూ.50,000 తో బుకింగ్స్ మొదలయ్యాయని, ఇప్పటికి 1500 యూనిట్స్ బుక్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. మరి BYD Atto 3 కారు యొక్క ధర, బుక్ చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకుందాం పదండి.
BYD Atto 3 ధర, బుకింగ్ వివరాలు
BYD Atto 3 కారుని రూ.33.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కంపెనీ మార్కెట్ లోకి వదిలింది. ఈ కారుని కొనాలనుకునేవారు రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్ లో BYD Atto 3 కారు, హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ కార్లతో పోటీ పడనుంది.
BYD Atto 3 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
BYD Atto 3 లో 60.48 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. ఇది 80 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంది. అలాగే ఈ కారు బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇంకా టైప్ 2 ఏసీ చార్జర్ కారులో అందుబాటులో ఉంది. ఇది కారుని 10 గంటల్లో పూర్తిగా చార్జ్ చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు 3.3 కిలోవాట్ పవర్ బ్యాకప్ తో వస్తోంది. ఇది కాకుండా, BYD Atto 3 కారు 7 కిలోవాట్ ఏసీ చార్జర్, 3 కిలోవాట్ పోర్టబుల్ చార్జింగ్ బాక్స్ తో వస్తోంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే కారు 521 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందని కంపెనీ చెబుతోంది.
BYD Atto 3 కారుపై BYD కంపెనీ 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారంటీని ఇస్తోంది. బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. ప్రమోషనల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 3 సంవత్సరాల 4జీ డేటా సబ్‌స్క్రిప్షన్ మరియు 6 ఉచిత సేవలతో వస్తోంది.
BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరని రూ.33.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ కారుపై ఆసక్తి గల వారు రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోండి. బుకింగ్ కోసం మీకు దగ్గర్లోని డీలర్షిప్ లో గాని, బీవైడీ అధికార వెబ్ సైట్ ని గాని విజిట్ చేయండి. ఇకపోతే, భారతీయ మార్కెట్ లో BYD Atto 3 కారు, హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ కార్లతో పోటీపడుతుందని అంతా భావిస్తున్నారు. BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు రాకతో E-SUV మార్కెట్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.