రూ.11.50 లక్షల ధరతో భారత మార్కెట్ లో లాంచైన Citroen eC3

Highlights

  • భారత్ లో లాంచైన Citroen eC3 ఎలక్ట్రిక్ కారు
  • Citroen eC3 ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్ ధర రూ.11.50 లక్షల నుంచి ప్రారంభం
  • సింగిల్ చార్జ్ పై 320 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Citroen eC3 ఎలక్ట్రిక్ కారు

Citroen India భారత్ లో Citroen eC3 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసింది. Citroen eC3 కారు ధర కూడా రివీల్ అయ్యింది. ఈ Citroen eC3 ఎలక్ట్రిక్ కారు చూడటానికి Citroen C3 పెట్రోల్ వర్షన్ కారు మాదిరే ఉంది. Citroen eC3 ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఈ ఎలక్ట్రిక్ కారు, 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. సింగిల్ చార్జ్ పై ఈ కారు 320 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. సరే, ఓసారి Citroen eC3 కారు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Citroen eC3 ఎలక్ట్రిక్ కారు ధర

Citroen eC3 కారు ఆకర్షణీయమైన హంగులతో, శక్తివంతమైన విద్యుత్ మోటార్ తో వచ్చింది. ఇక అంటే, మిగతాదంతా పెట్రోల్ వర్షన్ మాదిరే ఉంటుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ కారు ధరను రూ.11.50 లక్షలుగా నిర్ణయించారు. టాప్ వేరియంట్ ధర రూ.12.43 లక్షలుగా ఉంది. ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్ తో కంపెనీ ఈ కారు యొక్క బుకింగ్స్ ని కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశంలోని 25 నగరాల్లో ఈ కారు బుకింగ్స్ జరుగుతున్నాయి.

Citroen eC3 మోటర్ మరియు రేంజ్

Citroen eC3 కారు 170 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరన్స్ కలిగి ఉంది. ఇంకా ఈ కారులో 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని 57హెచ్‌పీ పవర్, 143ఎన్ఎమ్ పీక్ టార్క్ గల మోటర్ కి అనుసంధానించారు. Citroen eC3 కారు యొక్క ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 320 కిలోమీటర్లు. ఈ కారులో రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి: ఇకో మరియు స్టాండర్డ్.

Citroen eC3 కారులో 10.2-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ కారులో 4 స్పీకర్లు, మైసిట్రన్ కనెక్ట్ యాప్ ద్వారా కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఫ్రెంచ్ ఆటోమేకర్ అయిన సిట్రన్ సంస్థ Citroen eC3 కారు బ్యాటరీపై 7 ఏళ్ళు లేదా 1,40,000 కిలోమీర్ల వ్యారంటీ అందిస్తోంది. ఇంకా ఎలక్ట్రిక్ మోటర్ పై 5 ఏళ్ళు లేదా 1,00,000 కిలోమీటర్ల వ్యారంటీ, కారుపై 3 ఏళ్ళు లేదా 1,25,000 కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది.

Citroen eC3 కారు 0 నుంచి 60కేఎంపీహెచ్ స్పీడుని చేరుకునేందుకు 6.8 సెకన్ల సమయం తీసుకుంటుందని కంపెనీ చెబుతోంది. Citroen eC3 కారు గరిష్ట వేగం 107కేఎంపీహెచ్. Citroen eC3 కారు డీసీ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా బ్యాటరీ 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.269, రూ.769 ప్లాన్స్‌ని లాంచ్ చేసిన BSNL
Next articleఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.