Home News 320KM రేంజ్, ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Citroen eC3 ఎలక్ట్రిక్ కారు

320KM రేంజ్, ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Citroen eC3 ఎలక్ట్రిక్ కారు

Highlights
  • Citroen eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ని భారత్ లో లాంచ్ చేసిన Citroen కంపెనీ
  • 320 కిలోమీటర్ల రేంజ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Citroen eC3
  • ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 10.2-ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, 2 ఎయిర్‌బ్యాగ్స్, 170ఎంఎం గ్రౌండ్ క్లియరన్స్ ఈ కారు ప్రత్యేకతలు

Citroen India ఎట్టకేలకు తన కొత్త Citroen eC3 ఈవీ హ్యాచ్ బ్యాక్ ని లాంచ్ చేసింది. త్వరలోనే ఈ కారు ధరలను కంపెనీ ప్రకటించనుంది. Citroen eC3 ఎలక్ట్రిక్ కారు 29.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. ఇది సింగిల్ చార్జ్ పై 320 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.

Citroen eC3 హ్యాచ్‌బ్యాక్ లో 10.2-ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రీజనరేటివ్ బ్రేకింగ్, డ్రైవింగ్ మోడ్స్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయి. రీసెంట్ గా 315 కిలోమీటర్ల రేంజ్ తో లాంచైన Tata Tiago EV తో Citroen eC3 పోటీ పడనుంది.

భారత్ లో లాంచైన ‘సిట్రన్ ఈసీ3’ ఎలక్ట్రిక్ కారు

Citroen eC3 ఎలక్ట్రిక్ కారు చూడటానికి ఐసీఈ-పవర్డ్ సీ3 కారు మాదిరే ఉంది. Citroen eC3 విభిన్న స్టైలింగ్, ప్రత్యేకించి ఆరెంజ్ ప్రెస్ కలర్ లో డిఫరెంట్ గా ఉంది. Citroen eC3 ఎస్‌యూవీ స్టైలింగ్ ని కలిగి ఉండి, 170ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తోంది. సెంట్రల్ ఫ్లోర్ కన్సోల్ ని కాస్త మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ స్థానంలో ఎలక్ట్రానిక్ గేర్ సెలెక్టర్ ఉంటుంది.

Citroen eC3 ఎలక్ట్రిక్ కారులో 29.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 57 హెచ్‌పీ పీక్ పవర్, 143 నానో మీటర్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. Citroen eC3 కారు ఏఆర్ఏఐ సర్టిఫైడ్ 320 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. ఇకో మరియు స్టాండర్డ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఈ కారులో ఉన్నాయి. Citroen eC3 కారు 0 నుంచి 60కేఎంపీహెచ్ వేగాన్ని 6.8 సెకన్లలో చేరుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ 107 కేఎంపీహెచ్. ఈ కారు డీసీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది.

Citroen eC3 కారులో 10.2-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్స్, కనెక్టెడ్ కార్ టెక్ (మైసిట్రన్ కనెక్ట్ యాప్ ద్వారా) ఫీచర్లు, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

ఫ్రెంచ్ ఆటోమేకర్ అయిన Citroen బ్యాటరీ ప్యాక్ పై 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వ్యారంటీని అందిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ మోటర్ పై 5 ఏళ్ళు లేదా 1,00,000 కిలోమీటర్ల వ్యారంటీ ఇస్తోంది. కారుపై 3 ఏళ్ళు లేదా 1,25,000 కిలోమీటర్ల వ్యారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Citroen eC3 ఎలక్ట్రిక్ కారు రూ.9 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంది. 2023 జనవరి 22 నుంచి Citroen eC3 కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.