Home News CMF Phone 1 ఇండియా లాంచ్ ఖరారు, ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల

CMF Phone 1 ఇండియా లాంచ్ ఖరారు, ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల

Highlights
  • CMF Phone 1 టీజర్ విడుదల
  • ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తోన్న ఫోన్
  • ధర రూ.20,000 లోపు ఉండే చాన్స్

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/06/CMF-Phone-1.jpg

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో ఒక చవకైన ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా CMF Phone 1 యొక్క టీజర్ ను సదరు బ్రాండ్ విడుదల చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ టీజర్‌ను చూడవచ్చు. ఓసారి CMF Phone 1 యొక్క టీజర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

CMF Phone 1 టీజర్ వివరాలు

CMF Phone 1 టీజర్ ఇమేజ్‌ను గమనిస్తే, డివైజ్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లెదర్ టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

CMF Phone 1 డివైజ్‌కి కుడివైపున రొటేటింగ్ నాబ్ కనిపిస్తోంది. అయితే ఇది ఎందుకోసమో తెలియదు.

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే, జూన్ నెలలోనే లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone 1 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌తో లాంచ్ కానుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: CMF Phone 1 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: CMF Phone 1 లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.