
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone (1) పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జులై 5వ తేదీన CMF Phone (1) భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయలేదు. సరే, ఓసారి లీకైన వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
CMF Phone (1) ఇండియా లాంచ్ తేదీ
CMF Phone (1) యొక్క లాంచ్ తేదీ వివరాలను టిప్‌స్టర్ @Technerd_9 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది.
లీక్ ప్రకారం, CMF Phone (1) డివైజ్ భారతీయ మార్కెట్ లో జులై 5వ తేదీన లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.
CMF Phone (1) యొక్క అఫీషియల్ డిజైన్ జూన్ 26న విడుదల అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.
రివీలైన పిక్ గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.
పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉంది. ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై స్క్రూ కనిపిస్తోంది. సొంతంగా రిపేరు చేసుకోదగిన ఫోన్ అని ఈ స్క్రూ ద్వారా అర్థమవుతోంది.
CMF Phone (1) స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: CMF Phone (1) లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: CMF Phone (1) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
మెమొరీ: CMF Phone (1) రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 128జిబి/256జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్.
కెమెరా: CMF Phone (1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: CMF Phone (1) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఓఎస్: CMF Phone (1) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
కనెక్టివిటీ: CMF Phone (1) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











