ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 అనే స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. టీజర్ ఇమేజ్ ద్వారా లాంచ్‌ని సీఎంఎఫ్ బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. తాజాగా, CMF Phone 1 యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
CMF Phone 1 ధర (లీక్)
CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. వీటి ధరలు తెలుసుకుందాం.
CMF Phone 1 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉండనుంది.
CMF Phone 1 6జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ.2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను బ్రాండ్ అందిస్తోంది.
CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.
మెమొరీ: CMF Phone 1 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని అందిస్తున్నారు.
కెమెరా: CMF Phone 1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
Source: 91Mobiles
