
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్ తో వస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన డివైజ్ ఇమేజెస్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. జులై 8వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
అఫీషియల్ టీజర్ ప్రకారం, CMF Phone 1 డివైజ్ 50ఎంపి రియర్ కెమెరా, సోని సెన్సర్, 2ఎక్స్ ఇన్-సెన్సర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అల్ట్రావైడ్ లెన్స్, పొట్రెయిట్ కెమెరా ఉండనున్నాయి.
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ చిప్సెట్ తో CMF Phone 1 భారత్ లో లాంచ్ అవుతోంది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి బూస్టర్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
CMF Phone 1 ఫోన్ సూపర్అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లు ఇదివరకే సీఎంఎఫ్ బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. స్క్రీన్ సైజ్ ఇంకా ఖరారు కాలేదు.
ఫోన్ లుక్ గురించి మాట్లాడితే, బ్యాక్ ప్యానెల్ పై ఒక స్క్రూ ఉంది. ఇంకా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
CMF Phone 1 ధర, కలర్ ఆప్షన్స్ (అంచనా)
లీక్ ప్రకారం, CMF Phone 1 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా పెట్టారు. ఆరెంజ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: CMF Phone 1 డివైజ్ లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం. రియర్ కెమెరాపై బ్రాండ్ నుంచి స్పష్టత వచ్చింది.
సాఫ్ట్వేర్: CMF Phone 1 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: CMF Phone 1 డివైజ్ ఐపీ52 రేటింగ్, మోనో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.












