Nothing Phone (1) మార్కెట్ లోకి రాక ముందు, వచ్చాక తన హవాని కొనసాగిస్తోంది. కొంతమంది ఈ ఫోన్ పై పెదవి విరిచినప్పటికీ, దీనికున్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫోన్ కి యూజర్స్ లో ప్రత్యేకించి యూత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో కొత్తదనం కోరుకునే వారు Nothing Phone (1) ఫోన్ ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
అడపాదడపా Nothing Phone (1) పై ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి పలుమార్లు ఈ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో భాగంగా మరొకసారి Nothing Phone (1) పై నతింగ్ కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ జనవరి 20 తో ముగుస్తుంది. కాగా, Nothing Phone (1) బేస్ వేరియంట్ లాంచ్ ధర రూ.33,999 కాగా, ప్రస్తుతం డిస్కౌంట్ పై రూ.25,999 కి లభిస్తోంది. డీల్ ముగిశాక మరలా ఫోన్ ధర పెరగనుంది. కాబట్టి, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
Nothing Phone (1) డిస్కౌంట్ ఆఫర్స్
Nothing Phone (1) 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.25,999 గా ఉంది. ఐసీఐసీఐ మరియు సిటీ బ్యాంక్ యూజర్లు బ్యాంక్ డీల్స్ పొందవచ్చు. ఇకపోతే Nothing Ear (Stick) బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.6,999 కి లభిస్తుంది. ఈ డీల్స్ జనవరి 20 తో ముగుస్తాయి.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
Nothing Phone (1) లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 10-బిట్ హెచ్డీఆర్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు.
Nothing Phone (1) ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ కి ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ఇవ్వబడింది. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ క్యూఐ వర్లెస్ చార్జింగ్, 5వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Nothing Phone (1) లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఇచ్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
