Home News 14 రోజుల బ్యాటరీ లైఫ్, 30m వాటర్ రెసిస్టన్స్ తో లాంచ్ అయిన DIZO Watch D Plus

14 రోజుల బ్యాటరీ లైఫ్, 30m వాటర్ రెసిస్టన్స్ తో లాంచ్ అయిన DIZO Watch D Plus

హైలైట్స్

రియల్మీ యొక్క మొట్టమొదటి టెక్‌లైఫ్ ఇకోసిస్టమ్ బ్రాండ్, Dizo డీ-సిరీస్ లో కొత్త స్మార్ట్ వాచ్ DIZO Watch D Plus ని లాంచ్ చేసింది. ఈ వాచ్ ఇప్పటికే మార్కెట్ లో దూసుకెళ్తోన్న బోట్, నాయిస్, రియల్మీ వాచెస్ తో పోటీ పడనుంది. అల్యూమినియమ్ ఫ్రేమ్, 110+ స్పోర్ట్స్ మోడ్స్, భారీ డిస్ప్లే DIZO Watch D Plus లో హైలైట్ గా నిలుస్తున్నాయి.

ఇప్పటి వరకు కంపెనీ డీ-సిరీస్ లో లాంచ్ అయిన అన్ని వాచెస్ లో కెల్లా DIZO Watch D Plus ఎంతో చవకైన వాచ్ గా నిలుస్తోంది. భారత్ లో DIZO Watch D Plus యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో DIZO Watch D Plus ధర, లభ్యత

DIZO Watch D Plus ధరను భారత్ లో రూ.1,999 గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా నవంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ వాచ్ సేల్ కి రానుంది. ఈ వాచ్ క్లాసిక్ బ్లాక్, సిల్వర్ గ్రే, డీప్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

DIZO Watch D Plus స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

DIZO Watch D Plus 1.85-ఇంచ్ భారీ డిస్ప్లే తో వస్తోంది. DIZO Watch D లో కూడా ఇదే సైజు డిస్ప్లే ఉంది. DIZO Watch D Plus లో 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కర్వ్డ్ టెంపర్డ్ గ్లాస్ అందించారు. వాచ్ ఫ్రేమ్స్ అల్యూమినియమ్ తో తయారయ్యాయి. అలాగే 22ఎంఎం సిలికాన్ స్ట్రాప్ ని అందించారు. 150 కి పైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డిజో యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విడ్జెట్స్ మరియు వాచ్ ఫేసెస్ తో వాచ్ డ్యాష్ బోర్డ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. 3ఏటీఎం వాటర్ రెసిస్టన్స్ ని ఈ వాచ్ కలిగి ఉంది. వాటర్ స్ప్లాషెస్ ని ఈ వాచ్ తట్టుకోగలుగుతుంది. కానీ స్విమ్మింగ్ సమయంలో ఈ వాచ్ ని వాడకూడదు.

DIZO Watch D Plus లో 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై ఈ వాచ్ 14 రోజుల పాటు నడుస్తుంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి రెండు గంటల సమయం పడుతుంది. వాచ్ 60 రోజుల స్టాండ్ బై ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

జిమ్నాస్టిక్స్, యోగా, హైకింగ్, క్రాస్ ఫిట్, డ్యాన్సింగ్, కరాటే, తైక్వాండో, హార్స్ రైడింగ్, డిస్క్ గేమ్స్ వంటి 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ని ఈ వాచ్ కలిగి ఉంది. రియల్ టైమ్ హార్ట్ సెన్సర్, ఎస్పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్, మెన్‌స్ట్రువల్ పీరియడ్ ట్రాకర్, స్టెప్ కౌంటర్, కెలొరీస్ ట్రాకర్, వాటర్ డ్రింక్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇన్-బిల్ట్ జీపీఎస్ ఈ వాచ్ లో ఉంది.

DIZO Watch D Plus లో కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, అలారమ్, ఫైండ్ ఫోన్, కాల్ మరియు మెసేజ్ నోటిఫికేషన్స్, రిజెక్ట్ లేదా సైలెంట్ కాల్స్, వెదర్ ఫోర్‌కాస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.