Home News 12000mAh భారీ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న రగ్డ్ ఫోన్

12000mAh భారీ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న రగ్డ్ ఫోన్

హైలైట్స్:

డూజీ ఎస్89 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. అలీఎక్స్‌ప్రెస్ మరియు డూజీమాల్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. 65 వాట్ చార్జర్, 12000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్న తొలి రగ్డ్ ఫోన్ డూజీ ఎస్89 కావడం విశేషం. సాధారణ వాడకంపై ఈ ఫోన్ బ్యాటరీ మూడు రోజులకు పైగా నడుస్తుంది. సింగిల్ చార్జ్ తో 16 గంటల పాటు గేమ్స్ ఆడటంతో పాటు, 18 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చు. అంతటి భారీ బ్యాటరీ అయినప్పటికీ, కేవలం రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

డూజీ ఎస్89 ఫోన్లో ఆర్జీబీ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని బ్రీతింగ్ లైట్ అని మార్కెట్ చేస్తున్నారు. యూజర్లు ఈ లైట్ కలర్స్, ప్యాటెర్న్స్, స్పీడ్ ను తమ ఇష్టానుసారం మార్చుకోవచ్చు. ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ తదితర ఫంక్షన్స్ కి బ్రీతింగ్ లైట్ ఎఫెక్ట్ ని ఉపయోగించుకోవచ్చు.

Doogee S89 ధర

డూజీ ఎస్89 ఫోన్ ని అలీ ఎక్స్‌ప్రెస్, డూజీమాల్ ద్వారా నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ బ్రాండ్ ప్రమోషనల్ ఆఫర్ ను నడుపుతోంది. ఇందులో బాగంగా నేటి నుంచి ఆగస్టు 26 వరకు 50 శాతం డిస్కౌంట్ లభించనుంది. డూజీ ఎస్89 ప్రో అసలు ధర 459.98 డాలర్లు (దాదాపు రూ.36,800) కాగా, ప్రస్తుతం 229.99 డాలర్లు (రూ.18,400) కే లభించనుంది. ఈ ఆఫర్ మొదట ఆర్డర్ ప్లేస్ చేసే 200 మందికి మాత్రమే.

Doogee S89 స్పెసిఫికేషన్స్

డూజీ ఎస్89 ఫోన్ యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చి, 12000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది సింగిల్ చార్జి పై మూడు రోజులకు పైగా నడుస్తుంది. అలాగే ఇందులో 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 936 గంటల స్టాండ్ బై టైమ్ ని ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. అలాగే 18 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్, 60 గంటల కాలింగ్ టైమ్, 16.5 గంటల గేమింగ్ టైమ్, 42 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఈ ఫోన్ కలిగి ఉంది.

డూజీ ఎస్89 ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 20 ఎంపి నైట్ విజన్ 2.0 సెకండరీ లెన్స్, మ్యాక్రో షార్ట్స్ కూడా తీయగల 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపు 16ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందో లేదో తెలియదు. లాంచ్ అయితే కనుక కచ్చితంగా ఈ ఫోన్ కి మాంచి గిరాకీ ఏర్పడటం ఖాయం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఓటీటీ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.